అక్షరటుడే, వెబ్‌డెస్క్: India vs Pakistan Match : దుబాయ్ Dubai వేదికగా ఆసియా కప్ Asia cup 2025 గ్రూప్ – ఏ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట పాకిస్థాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ 40, షాహీన్ షా అఫ్రిది 33 రన్స్ చేశారు.
భారత్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు ఏడు వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్ విధించిన లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే భారత్ జట్టు ఛేదించింది.
India vs Pakistan Match : మొదటి నుంచి బాదుడే..
తొలి ఓవర్లోనే భారత్ 12 పరుగులు చేసింది. షాహీన్ వేసిన తొలి రెండు బంతుల్లో అభిషేక్ ఫోర్, సిక్స్‌తో అదరగొట్టాడు. రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఆటను రక్తి కట్టించిన గిల్ 10 పరుగులు చేసి, అదే ఓవర్లో చివరి బంతికి పెవిలియన్ బాట పట్టాడు.
ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ నాలుగో బంతికి Team India భారత్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి, షైమ్ అయ్యూబ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అభిషేక్ 13 బంతులు 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
షైమ్ అయ్యూబ్ బౌలింగ్‌లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 31 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.