అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs WI | భారత్-వెస్టిండీస్ (India-west indies) మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ మొదటి మ్యాచ్‌ను భారీ తేడాతో గెలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. గ్రీవ్స్ (32), హోప్ (26), చేజ్ (24) మాత్రమే కొంత పోరాటం చేశారు. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు , బుమ్రా 3, కుల్దీప్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.
IND vs WI | భారత్ తొలి ఇన్నింగ్స్:
భారత్ బ్యాట్స్‌మెన్ తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించారు. కేఎల్ రాహుల్ (KL Rahul) 100 , ధ్రువ్ జురేల్ 125 , జడేజా 104 నాటౌట్ చేయగా, జట్టు మొత్తం 448 పరుగులు చేసింది. జడేజాతో (jadeja) పాటు వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 286 పరుగుల ఆధిక్యంలో ఉండగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఇక వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ మళ్లీ విఫలమైంది. 45.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. అలిక్ అథనాజ్ (38), గ్రీవ్స్ (25) ఒక్కరే కొంత పోరాటం చేశారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు , సిరాజ్ (Siraj) 3, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ తీశారు.
ఈ క్రమంలో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇటీవలి కాలంలో వెస్టిండీస్ జట్టు (West Indies team) పెద్దగా ప్రతిభ కనబరచలేకపోతుంది. పసికూనలు ఆడినట్టు ఆడి ఇన్నింగ్స్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో అయిన గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుంది వెస్టిండీస్ జట్టు.
ఇప్పుడు రెండు జట్లు రెండో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. వెస్టిండీస్ పుంజుకుంటుందా? లేక భారత్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుందా? వేచి చూడాలి!