అక్షరటుడే, నేషనల్ డెస్క్: India US Trade Deal | భారత్ – అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) శుక్రవారం తెలిపారు. చర్చలు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై చర్చించి, ఖరారు చేసేందుకు భారత్ – అమెరికా అధికారులు ఈ నెల 23న అమెరికాలో భేటీ కానున్నట్లు సమాచారం. కాగా.. ఈ సమావేశం సుమారు మూడు రోజుల పాటు సాగుతుందని తెలుస్తోంది.
India US Trade Deal | తగ్గనున్న సుంకాలు..
అమెరికా (America)తో పాటు.. బ్రిటన్, ఒమన్ దేశాలతో భారత్ చేస్తుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా న్యూజిలాండ్తో చేసుకున్న ట్రేడ్ డీల్ సైతం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కార్యరూపం దాల్చనుందని తెలిపారు. కాగా.. భారత్ – అమెరికా ఒప్పందం అమల్లోకి వచ్చినట్లయితే భారత్ ఎగుమతులపై సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి. ఈ డీల్స్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో భారత ఎగుమతులు పెరగనున్నాయి. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులు సైతం వచ్చే పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.