అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia on Trade deal | భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై (India-US trade agreement) రష్యా స్పందించింది. రెండు దేశాల మధ్య సోమవారం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపి వేయడానికి అంగీకరించిందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఈ విషయమై రష్యా స్పందిస్తూ.. తమ చమురు కొనుగోళ్లను ఆపేసినట్లు భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని తెలిపింది. తాము భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని రష్యా ప్రతినిధి తెలిపారు.
Russia on Trade deal | వ్యూహాత్మక భాగస్వామ్యం
భారత్‌పై సుంకాలను ట్రంప్ 18శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయడానికి భారత్ ఒప్పుకుందని, ప్రతిగా వెనిజుల నుంచి కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే అమెరికన్ ఉత్పత్తులను సైతం దిగుమతి చేసుకోవడానికి అంగీకరించిందన్నారు. సుంకాల తగ్గింపును భారత్ సైతం ధ్రువీకరించింది. ట్రంప్–మోదీ ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అయితే రష్యా చమరు కొనుగోళ్లు, అమెరికన్ ఉత్పత్తుల దిగుమతిపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఈ క్రమంలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరులతో మాట్లాడుతూ.. భారతదేశంతో తన సంబంధాన్ని రష్యా విలువైనదిగా భావిస్తుందన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటుందని తెలిపారు.