Homeక్రీడలుINDvsENG | చ‌రిత్ర సృష్టించేందుకు రెండు వికెట్ల దూరంలో భార‌త్.. ఐదు వికెట్లతో ఆకాశ్ దూకుడు

INDvsENG | చ‌రిత్ర సృష్టించేందుకు రెండు వికెట్ల దూరంలో భార‌త్.. ఐదు వికెట్లతో ఆకాశ్ దూకుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | బర్మింగ్‌హమ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ చివరి రోజు భారత్‌ India చరిత్రను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనా, ఇంగ్లండ్‌కు పరాజయం తప్పదని పరిస్థితులు చెబుతున్నాయి.

ఆట ప్రారంభమైన వెంటనే ఆకాశ్ దీప్ (Akash Deep) (5 వికెట్లు, 58 పరుగులు) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ను తుడిచిపెట్టేశాడు. మొదట ఓలీ పోప్ (24)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్, వెంటనే తన తదుపరి ఓవర్లో హ్యారీ బ్రూక్ (23)ను ఎల్బీగా ఔట్‌ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (35), జేమీ స్మిత్ (32 నాటౌట్) కాస్త రిస్క్‌ తీసుకొని నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను కొంతవరకే ఆందోళనకు గురిచేశారు.

INDvsENG | విజయం లాంఛనమే..

అయితే, లంచ్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ వేసిన ఓవర్లో స్టోక్స్ (England captain Ben Stokes) డిఫెన్స్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరగడంతో భారత్‌కు ఊరట లభించింది. 153 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరవ వికెట్ కోల్పోయింది. 199 పరుగులు వద్ద క్రిస్​ వోక్స్​ ఏడో వికెట్​ రూపంలో వెనుతిరిగాడు. 226 పరుగుల వద్ద జెమ్మి స్మిత్​ను అవుట్​ చేశాడు. ప్రస్తుతం క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితిలో భారత్ బౌలర్లు కొంచెం రెండు వికెట్లు తీస్తే విజయం వరిస్తుంది. వర్షం ఆటంకంగా మారినా, భారత బౌలర్లు త‌మ స‌త్తా చూపించారు. ప్రత్యేకించి ఆకాశ్ దీప్‌ స్పెల్ ఈ టెస్ట్‌లో మైలురాయిగా నిలవనుంది. ఆకాశ్​ దీప్​ ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్​, ప్రిసిద్​, వాషింగ్టన్​ సుందర్​ తలో వికెట్​ తీశారు. మరో రెండు వికెట్లు పడితే భారత్ విజయం సాధిస్తుంది. ఇంకా బాగానే ఓవర్లు ఉండటం భారత విజయం ఖాయమైనట్లే.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ లో భారత జట్టు ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటే.. అది మరో చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఈ మ్యాచ్‌తో శుభ్‌మ‌న్ గిల్ ( Captain Shubman Gil) స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ (Virat Kohli) (449)ని అధిగమించాడు శుభ్‌మ‌న్ గిల్‌. ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 150+ స్కోరు చేసిన బ్యాటర్లలో అలెన్‌ బోర్డర్‌ తర్వాత గిల్‌ రెండో ఆటగాడిగా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 587 ప‌రుగుల‌కి ఆలౌట్ కాగా, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 407 ప‌రుగులు చేసింది. ఇక భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 427/6 డిక్లేర్ చేసింది. దీంతో ప్ర‌త్య‌ర్ధి ముందు 608 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.