అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thailand | ప్రపంచంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాల్లో థాయిలాండ్ (Thailand) ఒకటిగా చెప్పవచ్చు. భారతీయులకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాలలో (Tourist Places) థాయిలాండ్ నిలుస్తుంది.
ప్రతి ఏటా కోట్లాది మంది పర్యటకులు థాయిలాండ్‌ని సందర్శిస్తుంటారు. అయితే త్వరలోనే భారతీయులకు రోడ్డు మార్గం ద్వారా కూడా థాయిలాండ్ వెళ్లే అవకాశం దక్కనుంది. థాయ్‌లాండ్‌కు విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ రోడ్డు ప్రయాణం ద్వారా అక్కడికి చేరుకోవడంలో మజా మాములుగా ఉండదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రోడ్డు మార్గంలో కూడా థాయిలాండ్ చేరుకోవచ్చని తెలిపింది.
Thailand | ఇక ఆగేదే లేదు..
అత్యంత పొడవైన జాతీయ రహదారి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. భారత్ నుంచి థాయిలాండ్‌కు india to Thailand road way రోడ్డు మార్గం నిర్మించాలని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ (atal bihari vajpayee) తొలిసారి ప్రతిపాదించారు. ఈ రహదారిని భారత్ నుంచి థాయిలాండ్‌కు మయన్మార్(Mayanmar) మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి 2002 ఏప్రిల్ నెలలో భారత్, మయన్మార్, థాయిలాండ్ దేశాలకు చెందిన మంత్రుల స్థాయి సమావేశంలో ఆమోదం తెలిపారు. భారత్ – మయన్మార్ – థాయిలాండ్ త్రైపాక్షిక జాతీయ రహదారి పొడవు 1,400 కిలోమీటర్లు. ఈ 1,400 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిని 2019 వరకు పూర్తి చేయాలని అప్పట్లో ప్రతిపాదించారు.
Thailand | 70 శాతం పనులు పూర్తి..
భారత్ నుంచి మయన్మార్ మీదుగా జాతీయ రహదారి పనులు 70 శాతం పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ జాతీయ రహదారి భారత్‌లోని మణిపూర్ రాష్ట్రంలో ఉన్న మోరే (Moreh) నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్‌లోని మే సోట్ వరకు ఉంటుందట. ఈ జాతీయ రహదారి పూర్తి అయితే.. దాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలని భారత్ భావిస్తోంది.
ఆగ్నేయ ఆసియాతో భారత్‌కు రోడ్డు మార్గాన్ని విస్తరించేందుకు వివిధ దేశాలైన లావోస్, కాంబోడియా, వియత్నాంలకు ఇదే రహదారిని పొడిగించాలని యోచిస్తోంది. ఇక థాయ్‌లాండ్‌కి వెళ్లే మార్గంలో ఎన్నో అద్భుతాలు మనకు చూసే అవకాశం కలుగుతుంది. ఇది 2,500 కిలోమీటర్స్ వరకు ఉంటుందట. ఈ జర్నీకి రెండున్నర రోజుల సమయం పట్టే అవకాశం ఉందట.