Homeక్రీడలుIndia Test Captain | టీమిండియాకు కొత్త శకం.. గిల్ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్ ఆడ‌నున్న...

India Test Captain | టీమిండియాకు కొత్త శకం.. గిల్ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్ ఆడ‌నున్న భార‌త్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: India Test Captain | రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్‌కి గుడ్​బై చెప్ప‌డంతో ఆయ‌న స్థానంలో ఎవ‌రు కెప్టెన్సీ అందుకుంటారనే ప్ర‌చారం జోరుగా సాగింది. ఈ క్ర‌మంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) (Board of Control for Cricket In India) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు(England tour) భారత టెస్టు జట్టును ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు అందరూ ఊహించినట్లుగానే యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా (Shubman Gill appointed as new captain) నియమిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కెప్టెన్సీ మార్పు అనివార్యమైంది. రోహిత శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ (Virat Kohli retirement from Test cricket) అయిన నేపథ్యంలో సెలెక్టర్లకు ఇది పెద్ద పరీక్షే.

India Test Captain | కొత్త టీమ్..

ఇంగ్లాండ్ పర్యటన కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ WTC సైకిల్ ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలనే భారత లక్ష్యానికి చాలా కీలకం. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ సిరీస్ (England series) ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి అనుభవజ్ఞులు టెస్ట్ క్రికెట్ (Test Cricket) నుంచి రిటైర్ అయిన తర్వాత భారత జట్టుకు ఇది కొత్త ప్రారంభం. దీంతో భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ గిల్ (Captain Gill) రూపంలో దొరికాడు. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit bumhra), రిషబ్ పంత్ (Rishab Pant), కేఎల్ రాహుల్ (KL Rahul) రేసులో ఉన్న స‌మ‌యంలో గిల్‌ని కెప్టెన్‌గా ప్ర‌క‌టించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ పర్యటనకు యువ టీం ఇండియాను ఎంపిక చేసింది.

యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ (Jaiswal and Abhimanyu Easwaran) ఓపెనింగ్ బ్యాటింగ్ బాధ్యతను స్వీకరించవచ్చు. కోహ్లీ (Kohli) లేకపోవడంతో మిడిలార్డర్‌లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్‌లకు (Sai Sudarshan and Karun Nair) స్థానం లభించింది. వీరు నంబర్ 4 పాత్రను పోషించగలరు. రిషబ్ పంత్‌ను (Rishabh Pant) వైస్ కెప్టెన్‌గా నియమించారు. అతను వికెట్ కీపింగ్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ధ్రువ్ జురెల్ రెండవ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

India Test Captain | ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్