అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA ODI | ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు (South African team) భారత పర్యటనలో బిజీగా ఉంది. ఇటీవల రెండు టెస్ట్‌లు ఆడిన సఫారీ జట్టు భారత్‌ని వైట్ వాష్ చేసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. అయితే రాంచీ (Ranchi) వేదికగా నవంబర్ 30న జరిగే తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli and Rohit Sharma) రీఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమవ్వడంతో టీమిండియా మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్‌నే (KL Rahul) కెప్టెన్‌గా ప్రకటించింది.టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో ఉంచుకొని జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వగా, గాయంతో జట్టుకి దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యాను కూడా ఎంపిక చేయలేదు.
IND vs SA ODI | పంత్కి విశ్రాంతి?
దేశవాళీ క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్, యువ బ్యాటర్ తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కింది. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చేరాడు. పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా ఎంపికవ్వగా, నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా అదృష్టం దక్కించుకున్నాడు.
గైక్వాడ్ జట్టులో ఉన్నా కూడా తొలి మ్యాచ్‌లో అతనికి అవకాశం దక్కడం కష్టమే. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడో స్థానంలో కోహ్లీ ఆడనుండగా, నాలుగో స్థానంలో కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు. దీర్ఘ విరామం తర్వాత వన్డేల్లో కనిపించబోతున్న రిషభ్ పంత్ ఎంపికపై కొంత అనుమానం ఉంది. పంత్ ఆడకపోతే ఐదో స్థానంలో తిలక్ వర్మకు అవకాశం దక్కే అవకాశం ఉంది.
స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, జడేజా బరిలోకి దిగుతారు. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతాడు. పేసర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ రాణా జట్టులోకి రావడం ఖాయం. ప్రసిధ్ కృష్ణ, జురెల్, తిలక్ వర్మలకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కడం కాస్త కష్టమే. అయితే టెస్ట్ సిరీస్‌లో దారుణంగా నిరాశపరచిన భారత జట్టు కనీసం వన్డే సిరీస్ అయిన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఈ వన్డే సిరీస్ (ODI series) తర్వాత టీ 20 సిరీస్ కూడా జరగనుంది.
IND vs SA ODI | సౌతాఫ్రికాతో తొలి వన్డే తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషభ్ పంత్/తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
IND vs SA ODI | భారత వన్డే జట్టుకి సెలక్ట్ అయిన ఆటగాళ్లు..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్.