HomeUncategorizedJaishankar | తాలిబన్​ మంత్రితో చర్చించిన భారత్​

Jaishankar | తాలిబన్​ మంత్రితో చర్చించిన భారత్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jaishankar | భారత్​–పాకిస్తాన్​ ఉద్రిక్తతల (india – pakistan tension) వేళ అఫ్గానిస్తాన్​లోని తాలిబన్​ ప్రభుత్వంతో (afghanistan taliban governament ) భారత్​ చర్చలు జరిపింది. అఫ్తానిస్తాన్​ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో (foreign minister aamir khan muttahida) భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ (external affairs minister jaishankar) ఫోన్‌లో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​తో (operation sindoor) పాక్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తాలిబన్​ ప్రభుత్వం (taliban governament) పహల్గామ్​ ఉగ్రదాడిని (pahalgam terror attack) ఖండించింది. అంతేగాకుండా భారత్​–పాకిస్తాన్​ ఉద్రిక్తతల సమయంలో భారత్​కు అనుకూలంగా మాట్లాడింది. ఈ క్రమంలో తాలిబన్ ప్రభుత్వం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్చలు జరపడం గమనార్హం.

అఫ్గానిస్తాన్​ మంత్రితో (afghanistan minister) జరిగిన చర్చలపై జైశంకర్​ ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. అఫ్గాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిని (pahalgam terror attack) తాలిబన్​ ప్రభుత్వం ఖండించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. అఫ్గాన్‌ ప్రజలతో స్నేహబంధాన్ని కొనసాగిస్తామని, వారి అభివృద్ధికి మద్దతు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Jaishankar | పాకిస్తాన్​ తప్పుడు ప్రచారం

పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) చేపట్టి పాకిస్తాన్​లోని ఉగ్రస్థావరాలు (pakistan terror camps) ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్​ ప్రయోగించిన ఓ క్షిపణి (missile) అఫ్గాన్‌ భూభాగంలో పడినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. అయితే ఈ విషయాన్ని తాలిబన్​ ప్రభుత్వం ఖండించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని తాలిబన్​ రక్షణశాఖ ప్రతినిధి (daliban defense spokesman) వెల్లడించారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్​ అఫ్గాన్​ మంత్రితో ఫోన్​లో మాట్లాడారు.