అక్షరటుడే, వెబ్‌డెస్క్: India summons | భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)(Indian Ministry of External Affairs) బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. బంగ్లాదేశ్‌లోని నేషనల్ సిటిజన్ పార్టీ (National Citizen Party) (ఎన్సీపీ) నాయకుడు హస్నత్ అబ్దుల్లా చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో పాటు ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా బెదిరింపులు రావడంతో సమన్లు జారీ చేసింది.
ఢాకాలోని సెంట్రల్ షహీద్ మినార్ వద్ద జరిగిన ఒక సమావేశంలో హస్నత్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని గౌరవించని శక్తులకు భారత్ ఆశ్రయం ఇస్తే.. బంగ్లాదేశ్ కూడా భారత వ్యతిరేక మరియు విచ్ఛిన్నతవాద శక్తులకు ఆశ్రయం ఇస్తుందని వ్యాఖ్యానించారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను ఆ దేశం నుంచి వేరు చేస్తామని హెచ్చరించారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొంది 54 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, దేశాన్ని నియంత్రించాలని చూస్తున్న ‘రాబందులు’ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ అబ్దుల్లా వ్యాఖ్యలు ‘బాధ్యతారహితమైనవి మరియు ప్రమాదకరమైనవి’గా అభివర్ణించాడు. భారత్ అణ్వస్త్ర శక్తి సామర్థ్యం కలిగిన దేశం, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ.. బంగ్లాదేశ్ ఇలాంటి ఆలోచనలు చేయడం కూడా అసాధ్యమన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ దౌత్యపరమైన చర్యల ద్వారా ఆందోళనలను బలంగా వ్యక్తం చేసింది.