అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Bharat Summit | హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం(Government) నిర్వహించనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక ప్రసంగాలు చేయనున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) నేపథ్యంలో నిఘా వర్గాలు మరిన్ని దాడులకు అవకాశం ఉందని హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర పోలీసులు(State Police) అప్రమత్తం అయ్యారు. వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సమ్మిట్ ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపట్టారు. సమ్మిట్ జరిగే హెచ్‌ఐసీసీ(HICC)తో పాటు సైబరాబాద్ పరిసర ప్రాంతాలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
Bharat Summit | నేటి నుంచి భారత్ సమ్మిట్.. పాల్గొనున్న 100 దేశాల ప్రతినిధులు
2