- Advertisement -
HomeUncategorizedUS tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత దిగుమతులపై అదనంగా 25 సుంకాలు విధించడం అన్యాయం, అసమంజసమని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ చర్యను “చాలా దురదృష్టకరం” అని పేర్కొంది.

- Advertisement -

US tariffs : ఆర్థిక సార్వభౌమత్యాన్ని కాపాడుకుంటాం..

అనేక ఇతర దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలనే భారతదేశం కూడా తీసుకుంటోందని, కానీ కేవలం ఇండియాను లక్ష్యంగా చేసుకోవాలనే అమెరికా నిర్ణయం చాలా అన్యాయమని విదేశాంగ శాఖ External Affairs Ministry ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

“అమెరికా అదనపు సుంకాలుఈ అన్యాయం, అసమంజసమైనవి” అని జైస్వాల్ అన్నారు. భారతదేశం తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ఏకపక్ష చర్యల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రష్యా (Russia) నుంచి చమురు దిగుమతులను చేసుకోవడంపై అమెరికా ఇటీవల భారత్ ను లక్ష్యంగా చేసుకుందని జైస్వాల్ అన్నారు. “మా దిగుమతులు మార్కెట్ కారకాలపై ఆధారపడి ఉన్నాయి. భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడం లక్ష్యంగానే మా విధాన నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికే దీనిపై మా వైఖరిని స్పష్టం చేశాం..” అని జైస్వాల్ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News