అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Stock Market Rally | బలహీనమైన గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతోపాటు యూఎస్, భారత్‌ల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన కుదిరిన నేపథ్యంలో మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.
ఎఫఐఐలు నికర కొనుగోలుదారులుగా నిలవడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దిగివస్తుండడం, రూపాయి విలువ కాస్త పెరగడం వంటి కారణాలు ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్‌ను పెంచాయి. ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), శ్రీరామ్ ఫైనాన్స్ వంటి నిఫ్టీ 50 ప్యాక్ స్టాక్స్ మూడో త్రైమాసికంలో అద్భుత పనితీరును కనబరచడంతో సూచీలు పరుగులు తీస్తున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 597 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమై వెంటనే 317 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని తిరిగి 454 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో ప్రారంభమై, అక్కడినుంచి 108 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి పుంజుకుని 142 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 12.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 84,025 వద్ద, నిఫ్టీ (Nifty) 151 పాయింట్ల లాభంతో 25,845 వద్ద ఉన్నాయి.
ఎఫ్ఎంసీజీ మినహా..
ఎఫ్ఎంసీజీ సెక్టార్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.19 శాతం నష్టంతో ఉంది. మెటల్, కన్జూమర్ డ్యూరెబుల్, రియాలిటీ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా లాభంతో ఉండగా.. టెలికాం, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు రాణిస్తున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 11 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ 6.80 శాతం, టాటా స్టీల్ 3.70 శాతం, బీఈఎల్ 2.21 శాతం, టైటాన్ 1.67 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.39 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : పవర్‌గ్రిడ్ 1.25 శాతం, ఐటీసీ 0.94 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.67 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.33 శాతం, ఎన్టీపీసీ 0.29 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.