Stock Market Crash | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టు బిగించడంతో ప్రధాన సూచీలన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | ఓవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధభయాలతో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు.. మరోవైపు దూసుకొస్తున్న ఏఐ.. ఇంకోవైపు ట్రంప్ టారిఫ్‌ (Trump Tariff)ల గోల.. వెరసి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

మంగళవారం ఉదయం సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 669 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 181 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టంతో 82,578 వద్ద, నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో 25,515 వద్ద ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమంటూ అక్కడి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేసింది. దీనిపై ట్రంప్ కఠువుగా స్పందించారు. వాణిజ్య ఒప్పందాలనుంచి వెనక్కి తగ్గే దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఐటీలో కొనసాగుతున్న పతనం..

ఏఐ టూల్స్ సంప్రదాయ ఐటీ కంపెనీలను కోలుకోనీయడం లేదు. క్లాడ్ ఏఐ టూల్స్‌తో సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను ఆధునికీకరించే ఖర్చు తగ్గుతుందంటూ ఆంథ్రోపిక్ చేసిన ప్రకటనతో దేశీయ ఐటీ కంపెనీలు నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. ఇంట్రాడేలో నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ 4 శాతం వరకు నష్టపోయింది. టెలికాం, మీడియా రంగాల షేర్లు ఒక శాతానికిపైగా నష్టంతో ఉండగా.. రియాలిటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు నష్టాలతో కదలాడుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఫార్మా రంగాల ఇండెక్స్‌లు మాత్రమే స్పల్ప లాభాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 20 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ 0.48 శాతం, హెచ్‌యూఎల్ 0.31 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.16 శాతం, కొటక్ బ్యాంక్ 0.16 శాతం, ఎస్‌బీఐ 0.09 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టెక్‌మహీంద్రా 4.57 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.55 శాతం, ఎటర్నల్ 4.46 శాతం, ఇన్ఫోసిస్ 3.63 శాతం, టీసీఎస్ 2.97 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Related articles

Harish Rao Demands Halt | పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలి : హరీశ్​రావు

ఖమ్మం జిల్లా వినోబానగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు.

Inter Exams 2026 | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్​ పరీక్షలు.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Inter Exams 2026 | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్​ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధిత అధికారులు ఆయా...

Hyderabad Cyber Crime Arrests | 104 మంది సైబర్​ నేరగాళ్ల అరెస్ట్​.. నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు

హైదరాబాద్ సైబర్​ క్రైమ్​​ పోలీసులు భారీ ఆపరేషన్​ చేపట్టారు. 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Influencer Labor Controversy | భార్య ప్రసవ వేదనను వీడియోగా.. మధ్యలో యాడ్ ప్రమోషన్ .. పిచ్చి పీక్స్‌కి చేరిందేంటి..!

సియాటెల్‌లో నివసిస్తున్న చైనాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ తన భార్య 23 గంటల ప్రసవ వేదనను వీడియోగా పోస్ట్ చేసి, అదే వీడియోలో పెయిడ్ యాడ్ చదివిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రజాగ్రహం మధ్య డౌయిన్, వీబో అతడి ఖాతాలను నిషేధించాయి.