Homeక్రీడలుIND vs SL | చెలరేగిన ప్రతికా, మంధాన.. భారత్ శుభారంభం!

IND vs SL | చెలరేగిన ప్రతికా, మంధాన.. భారత్ శుభారంభం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: శ్రీలంక పర్యటన(Srilanka tour)లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ముక్కోణపు వన్డే సిరీస్‌(ODI Tri-Nation Series)లో భాగంగా ఆదివారం కొలంబో(Colombo) వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్.. 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. హసిని పెరెరా(30), కవిషా దిల్‌హరి(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భారత బౌలర్ల(Indian bowlers)లో స్నేహ్ రాణా(3/31) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, శ్రీ చరణి రెండేసి వికెట్లు పడగొట్టారు. తెలుగు తేజం అరుంధతి రెడ్డికి ఓ వికెట్ దక్కింది. అనంతరం భారత మహిళల జట్టు 29.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 149 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

ప్రతికా రావల్ Prathimka raaval (62 బంతుల్లో 7 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. స్మృతి మంధాన srmruthi mandhana (46 బంతుల్లో 6 ఫోర్లతో 43), హర్లీన్ డియోల్(71 బంతుల్లో 4 ఫోర్లతో 48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మంగళవారం రెండో వన్డే‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ఈ ముక్కోణపు సిరీస్ జరగుతుంది. ఒక్కో జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడనున్నాయి.

Must Read
Related News