ePaper
More
    Homeఅంతర్జాతీయంFighter Jet Crash | బంగ్లాదేశ్​ విమాన ప్రమాద బాధితులకు అండగా భారత్​

    Fighter Jet Crash | బంగ్లాదేశ్​ విమాన ప్రమాద బాధితులకు అండగా భారత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Fighter Jet Crash | బంగ్లాదేశ్ రాజధానిలో శిక్షణ యుద్ధ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఓ కాలేజీ భవనం(College Building)పై ఫైటర్​ జెట్​ కూలడంతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. దీంతో పొరుగు దేశానికి భారత్​ ఆపన్న హస్తం అందించింది. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య బృందాన్ని బంగ్లాదేశ్(Bangladesh)​కు పంపించింది. అవసరం అయితే క్షతగాత్రులను భారత్​కు తీసుకొచ్చి వైద్యం అందిస్తామని తెలిపింది.

    Fighter Jet Crash | విషాదం నింపిన ప్రమాదం

    బంగ్లా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F-7 BGI శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకాలోని మైల్స్‌స్టోన్‌ స్కూల్‌, కాలేజ్‌ (Milestone School, College) ప్రాంగణంలో కూలిపోయింది. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఉండడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. స్థానికులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...