అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan’s Fatah missile | భారత్ ప్రతిదాడులతో దెబ్బతిన్న పాకిస్తాన్ ఆగం అయిపోయింది. ఒకవైపు ప్రపంచాన్ని సాయం అడుక్కుంటూనే మరోవైపు మేకపోతు గాంభీర్యంతో భారత్‌పై దాడులు చేస్తోంది. దాయాది దేశం ఎన్ని ఎత్తులు వేసినా.. ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. కాగా, భారత్‌లో తెలియని వ్యూహాత్మక లక్ష్యం వైపు దూసుకువస్తున్న పాక్‌కు చెందిన ఫతాహ్ క్షిపణిని భారత్ గుర్తించింది. వెంటనే స్పందించి పశ్చిమ సెక్టార్‌లోనే దానిని భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయి.
