ePaper
More
    HomeజాతీయంSolar Power | సౌర విద్యుత్​ ఉత్పత్తిలో భారత్​ రికార్డు.. జపాన్​ను దాటేసి మూడో స్థానానికి..

    Solar Power | సౌర విద్యుత్​ ఉత్పత్తిలో భారత్​ రికార్డు.. జపాన్​ను దాటేసి మూడో స్థానానికి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Solar Power | సౌర విద్యుత్​ ఉత్పత్తిలో భారత్​ మరో రికార్డు సాధించింది. ప్రపంచంలో సోలార్​ కరెంట్​ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో జపాన్​ను దాటేసి మూడో స్థానానికి చేరింది. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (IRENA) లెక్కల ప్రకారం.. భారతదేశం 1,08,494 GWh సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి చేస్తోంది. జపాన్​ను (96,459 GWh) భారత్​ దాటేసింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి (Energy Minister Pralhad Joshi) ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

    Solar Power | కేంద్రం ప్రత్యేక దృష్టి

    ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే విద్యుత్​ ఉత్పత్తి (Electricity Generation) ఎక్కువ జరుగుతోంది. థర్మల్​ విద్యుత్​తో కాలుష్యం, ఖర్చు రెండు ఎక్కువ అవుతాయి. దేశంలో బొగ్గు ద్వారానే 45.5 శాతం విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో సౌర విద్యుత్​ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్​ సంస్థల ఆధ్వర్యంలో సోలార్​ యూనిట్లు (Solar Units) నెలకొల్పేందుకు నిబంధనలు సరళీకరించింది. అంతేగాకుండా ఇళ్లు, పొలాల్లో సబ్సిడీపై సౌర విద్యుత్​ యూనిట్లు నెలకొల్పేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది. దీంతో సౌర విద్యుత్​ ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది.

    Solar Power | 500 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం

    భవిష్యత్​లో దేశంలో 500 గిగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఆ లక్ష్యం చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో జపాన్​ను దాటేసి ప్రపంచంలో మూడో సోలార్​ విద్యుత్​ (Solar Electricity) ఉత్పత్తి దేశంగా అవతరించడం గమనార్హం. పెద్ద ఎత్తున సోలార్ పార్కులు, రూఫ్‌టాప్ సోలార్ విధానాలతో సౌర విద్యుత్​ ఉత్పత్తి పెరిగింది.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this