అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Semi Chances | టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా (Team India)కు సూపర్ 8 తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగి ఆడటంతో భారత్ ముందు 188 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
అయితే లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ విఫలమై కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది.మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ప్రారంభంలో టాప్ ఆర్డర్ కూలిపోయినా, మధ్యలో బ్రెవిస్ 45 (3 ఫోర్లు, 3 సిక్సులు), డేవిడ్ మిల్లర్ (David Miller)
– 63 (7 ఫోర్లు, 3 సిక్సులు), స్టబ్స్ 44 (1 ఫోర్, 3 సిక్సులు) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు.
India Semi Chances | సెమీస్ సమీకరణాలు ఎలా ఉన్నాయి?
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తీవ్రంగా తడబడింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోతూ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌతాఫ్రికా (South Africa) 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్ 8లో 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే భారత్ సెమీస్ చేరాలంటే ..మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాలి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా అవకాశాలు దాదాపు ముగిసినట్టే. సౌతాఫ్రికా మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఒకదానిలో ఓడితే నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది.
ఒకవేళ భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లకు తలా 4 పాయింట్లు వచ్చినట్లయితే, నెట్ రన్‌రేట్ (NRR) లెక్కలోకి వస్తుంది. అప్పుడు మెరుగైన NRR ఉన్న రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి.
భారత్ మిగిలిన మ్యాచ్‌లు:
ఫిబ్రవరి 26 – జింబాబ్వేతో
మార్చి 1 – వెస్టిండీస్‌తో
ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించడం భారత్‌కు అత్యంత కీలకం.
India Semi Chances| ముందున్న సవాల్
గ్రూప్ దశలో దూసుకెళ్లిన టీమిండియా, ఇప్పుడు డూ-ఆర్-డై పరిస్థితిలో ఉంది. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ కూడా కట్టుదిట్టంగా ఉండాలి. సౌతాఫ్రికా ఈ విజయంతో సెమీస్‌కు మరింత చేరువైంది. ఇక భారత్‌కు ప్రతి మ్యాచ్ ఫైనల్‌లాంటిదే. భారత్ తిరిగి గెలుపు బాట పట్టి సెమీస్ చేరుతుందా? లేక సూపర్ 8లోనే ప్రయాణం ముగుస్తుందా? అన్నది రాబోయే మ్యాచ్‌లతో తేలనుంది.
