
అక్షరటుడే, వెబ్‌డెస్క్: India rejects Pakistan’s allegations బలూచిస్తాన్(Balochistan)లోని ఖుజ్‌దార్‌లో జరిగిన బాంబు దాడి(Khuzdar bomb attack)లో భారత్ ప్రమేయం ఉందనే పాకిస్తాన్ ఆరోపణలను బుధవారం ఇండియా తీవ్రంగా ఖండించింది. పాక్ ఆరోపణలు “నిరాధారమైనవి” అని, ఇస్లామాబాద్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఉగ్రవాద కేంద్రంగా ప్రపంచ ఖ్యాతిని కప్పిపుచ్చే లక్ష్యంతో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs – MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
“ఈరోజు ఉదయం ఖుజ్‌దార్‌లో జరిగిన సంఘటనలో భారతదేశ ప్రమేయం ఉందని పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలను ఇండియా తిరస్కరిస్తుంది. ఇలాంటి అన్ని ఘటనలలో ప్రాణనష్టానికి భారత్ సంతాపం తెలియజేస్తుంది” అని పేర్కొన్నారు. భారత్‌ను నిందించడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారిందని, ఇది “ప్రపంచాన్ని మోసం చేయడానికిష, దాని సొంత దేశీయ సంక్షోభాల నుంచి, ఉగ్రవాద గ్రూపులకు నిరంతర మద్దతు నుంచి దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నమని అభివర్ణించారు.
India rejects Pakistan’s allegations : స్కూల్ బస్సుపై దాడి..
పాకిస్తాన్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం దారుణ ఉగ్రదాడి జరిగంది. ఐఈడీ అమర్చి స్కూల్ బస్సును పేల్చేయడంతో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖుజ్‌దార్‌లోని జీరో పాయింట్ ప్రాంతం సమీపంలో ఈ పేలుడు సంభవించింది. అయితే, దీనిపై ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థ కూడా తమ పనేనని ప్రకటించలేదు. మరోవైపు, అంతర్గత సంక్షోభాలను చక్కదిద్దుకోని పాకిస్తాన్ ఎప్పటిలానే భారత్‌పై ఆరోపణలు చేసింది. అయితే, పాక్ ఆరోపణలను ఇండియా తోసిపుచ్చింది.