- Advertisement -
HomeUncategorizedDalai Lama | వారుసుడి ఎంపిక ద‌లైలామా చేతుల్లోనే.. చైనా వాద‌న‌ను తోసిపుచ్చిన భార‌త్

Dalai Lama | వారుసుడి ఎంపిక ద‌లైలామా చేతుల్లోనే.. చైనా వాద‌న‌ను తోసిపుచ్చిన భార‌త్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dalai Lama | ద‌లైలామా వార‌సుడి ఎంపిక‌కు త‌మ ఆమోదం కావాల‌న్న చైనా వాద‌న‌ను ఇండియా (India) గురువారం తోసిపుచ్చింది. వార‌సుడి ఎంపిక నిర్ణ‌యం ప్ర‌ముఖ టిబెట్ ఆధ్యాత్మిక గురువారం ద‌లైలామా (Dalai Lama) చేతుల్లోనే ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. దలైలామా తదుపరి పునర్జన్మను బీజింగ్ ఆమోదించాలని చైనా (China) చేసిన వాదనను తీవ్రంగా ఖండించింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి మాత్రమే అతని వారసుడిని నిర్ణయించే అధికారం ఉందని పేర్కొంది. “దలైలామా టిబెటన్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అనుచరులలో ఆయ‌న చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ఆయన వారసుడిని ఎన్నుకునే నిర్ణయం దలైలామాదే” అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు (Minister Kiren Rijiju) తెలిపారు. ఇది పూర్తిగా మ‌త‌ప‌ర‌మైన సంబంధ‌మ‌ని తెలిపారు. ధర్మశాలలో దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు లల్లన్ సింగ్‌తో కలిసి రిజిజు ప్రభుత్వం త‌ర‌ఫున హాజ‌రయ్యారు.

Dalai Lama | తన వారసుడిపై దలైలామా నిర్ణయం

శతాబ్దాల నాటి దలైలామా సంస్థ తన జీవితకాలం తర్వాత కూడా కొనసాగుతుందని టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు పునరుద్ఘాటించిన తర్వాత కేంద్ర మంత్రి వ్యాఖ్యలు (Union Minister’s comments) చేశారు. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం దలైలామా అధికారిక కార్యాలయం అయిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Dalai Lama | త‌మ అనుమ‌తి కావాల‌న్న చైనా

ద‌లైలామా వార‌సుడ్ని గుర్తించే ప్ర‌క్రియ 2011 సెప్టెంబ‌ర్ 24 నాటి ప్ర‌క‌ట‌న మేర‌కే జ‌రుగుతుంద‌ని ఆయ‌న కార్యాల‌యం బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వార‌సుడి ఎంపిక‌ బాధ్యత పూర్తిగా గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ సభ్యులదేనని స్ప‌ష్టం చేసింది. అయితే, దీనిపై స్పందించిన చైనా (China).. దలైలామా వార‌సుడి ఎంపిక విష‌యంలో తమ‌ ఆమోదం త‌ప్ప‌నిస‌రి అని చైనా పేర్కొంది. దలైలామా వారసత్వం చైనా చట్టాలు (Chinese laws). నిబంధనలతో పాటు మతపరమైన ఆచారాలు, చారిత్రక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని అని డ్రాగ‌న్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Dragon Foreign Ministry) ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ఎంపిక చైనాలోనే జరగాలనే ఆ దేశ దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించారు.

Dalai Lama | టిబెట్ పోరాటాలు

చైనా పాలనకు వ్యతిరేకంగా టిబెట‌న్లు తిరుగుబాట చేశారు. అయితే, తిరుగుబాటు విఫ‌లం కావ‌డంతో టిబెట‌న్ల ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా (Dalai Lama) లాసా నుంచి పారిపోయారు. 1959 నుంచి ఆయ‌న భారతదేశంలో ప్రవాసం పొందుతున్నారు. చైనా (China) నుంచి టిబెట్‌ను విభజించడానికి ప్రయత్నిస్తున్న వేర్పాటువాదిగా బీజింగ్ ఆయ‌న‌పై ముద్ర వేస్తూనే ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అహింస, కరుణను వ్యాప్తి చేస్తే వ్య‌క్తిగా, టిబెటన్ ప్రజలు తమ సాంస్కృతిక, మత వారసత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నానికి చిహ్నంగా ద‌లైలామాను భావిస్తారు. ప్రవాసంలో ఉన్న చాలా మంది టిబెటన్లు భవిష్యత్తులో చైనా తన సొంత దలైలామాను స్థాపించడానికి ప్రయత్నించవచ్చని భయపడుతున్నారు. ఈ చర్య 1950లో బలవంతంగా ఆక్రమించిన ఈ ప్రాంతంపై బీజింగ్ నియంత్రణను బలోపేతం చేస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News