అక్షరటుడే, న్యూఢిల్లీ: ASIA CUP | ఆసియా కప్ 2025లో అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టు ట్రోఫీ స్వీకరణ వేడుకలో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఫైనల్‌లో పాకిస్థాన్‌పై (IND vs PAK) గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) Pakistan Cricket Board (PCB) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) Asian Cricket Council (ACC) అధ్యక్షుడు మోహ్‌సిన్ నఖ్వీ Mohsin Naqvi చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది.
భారత్ జట్టు నిరాకరించడంతో ఫైనల్ అనంతరం జరిగే అవార్డుల కార్యక్రమం గంటన్నర ఆలస్యమైంది. చివరికి పాకిస్థాన్ ఆటగాళ్లు Pakistani players రన్నరప్ మెడల్స్ స్వీకరించగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు (Player of the Match award) తిలక్ వర్మ (Tilak Verma) కు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు (Player of the Tournament award) అభిషేక్ శర్మ (Abhishek Sharma) కు దక్కాయి. అయితే టైటిల్ ట్రోఫీ మాత్రం వేదికపై అలానే ఉండిపోయింది.
ASIA CUP FINAL MATCH | సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే ..
సాధారణంగా కప్ స్వీకరించిన తర్వాత కెప్టెన్ స్పీచ్ ఇస్తాడు. కానీ, సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే వేడుక ముగిసిందని సైమన్ డౌల్ ఫైనల్ ప్రకటించారు.
వేదికపై టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్లు ఊహించుకొని సంబరాలు జరుపుకొన్నారు. ఫొటోలకు కూడా ట్రోఫీ లేకుండా ఫోజులిచ్చారు.
ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల పహల్గావ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ప్రతినిధుల చేతుల మీదుగా టైటిల్ స్వీకరించడం ఏ మాత్రం ఇష్టం లేకపోవడంతో భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాక పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోగా.. వారితో కలసి ఫొటోషూట్‌లో కూడా పాల్గొనలేదు.
ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఆడినప్పటికీ, తమ చర్యల ద్వారా భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చింది. “నీరు, రక్తం కలిసి ప్రవహించవు..“ అని.
ఇక ఆసియా కప్ ట్రోఫీని టీమిండియా తర్వాత స్వీకరిస్తుందా ? లేక ఆసియా క్రికెట్ కౌన్సిల్ వద్దే మిగిలిపోతుందా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆసక్తికర విషయం ఏమిటంటే భారత్, పాక్ కెప్టెన్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఒకరినొకరు చూసుకోలేదు.
మరోవైపు టాస్ సమయంలో ఇద్దరు ప్రజెంటర్స్ కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. టాస్ వేశాక భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్థాన్ కెప్టెన్‌తో ఆ జట్టు మాజీ పేసర్ వకార్ యూనిస్ మాట్లాడటం గమనార్హం.
ఇద్దరు కెప్టెన్స్‌తో ఇద్దరు ప్రజెంటర్స్ మాట్లాడటం క్రికెట్ చరిత్రలోనే ఇది తొలిసారి అని సమాచారం. తటస్థ ప్రజెంటర్‌ను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్)ను రిక్వెస్ట్ చేసినప్పటికీ, అందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఇద్దరు ప్రజెంటర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.