ePaper
More
    Homeఅంతర్జాతీయంIndia-Pakistan war | ఇండియా - పాకిస్తాన్​ యుద్ధం మొదలైనట్లేనా.. దాడులు, ప్రతిదాడులతో ఆందోళన

    India-Pakistan war | ఇండియా – పాకిస్తాన్​ యుద్ధం మొదలైనట్లేనా.. దాడులు, ప్రతిదాడులతో ఆందోళన

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: India-Pakistan war | పహల్గామ్ ​ ఉగ్రదాడి తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్​ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి, 9 ఉగ్ర స్థావరాలను తుడిచి పెట్టేసింది. భారత్​ వాయుసేన దాడితో సుమారు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

    భారత్​ ప్రతిదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన పాక్​.. ఏమి చేయాలో పాలుపోక జమ్మూ ఎయిర్​పోర్టుపై డ్రోన్లతో దాడికి దిగింది. కానీ భారత్​ వాయు రక్షణ వ్యవస్థలు, వాయు రక్షణ తుపాకులు చురుకుగా పనిచేశాయి. పాక్​కు చెందిన అనేక డ్రోన్‌లను కూల్చివేశాయి. అమృత్‌సర్‌, జమ్మూ, జైసల్మేర్ పై దాడి చేయడానికి పాక్​ చేసిన ప్రయత్నాలను భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది.

    మరో వైపు ఇండియన్​ నేవీ కూడా రంగంలోకి దిగింది. పాక్​ను కట్టడి చేసేందుకు భారత నావికాదళం పశ్చిమ కమాండ్ చేరాలని భావిస్తోంది.

    పాక్​ డ్రోన్ల దాడిని తిప్పి కొట్టిన తర్వాత ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్​ దోవల్​ భేటీ అయ్యారు. మరోవైపు త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసరంగా సమావేశమయ్యారు.

    కాగా, పాక్​ డ్రోన్ల దాడి తర్వాత.. భారత్​ కౌంటర్​ అటాక్​ ప్రారంభించింది. లాహోర్​, ఇస్లామాబాద్, సియాల్‌కోట్, బహవల్‌పూర్‌లలో భారత్​ ఆర్మీ వేగవంతమైన దాడులను చేపడుతోంది.

    భారత్​, ఇండియా దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైనట్లేనా.. అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    BOB Jobs | బీవోబీలో ఆఫీసర్‌ స్థాయి పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ స్థాయి...

    UPI Payments | రెండేళ్ల‌లో రెట్టింపు.. రోజుకు 700 మిలియ‌న్ల యూపీఐ లావాదేవీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI Payments | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నిత్య జీవ‌నంలో భాగమై...

    Staff Suspend | ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. ఏడుగురు సిబ్బందిపై వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Staff Suspend | స్వాతంత్య్ర దినోత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం(Security...

    PM Modi | ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం.. హాజరైన మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం...

    More like this