అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Pakistan T20 Match | టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్ (Pak) జరుగుతున్న మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ విఫలం అయింది. దీంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. నిర్ణిత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.
కోలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. తొలి ఓవర్లోనే అతడు డకౌట్ అయ్యాడు. అయినా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
India Pakistan T20 Match | 40 బంతుల్లో 77 పరుగులు
ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. ఓ ఎండ్‌లో తిలక్ వర్మ నెమ్మదిగా ఆడుతున్నా ఇషాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 88 పరుగుల వద్ద ఇషాన్ అవుట్ కాగా.. అందులో అతడి స్కోర్ 77 పరుగులు ఉండటం గమనార్హం. అయూబ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం తిలక్ వర్మ 25 పరుగులు చేసి ఔట్ కాగా.. హర్దిక్ పాండ్యా డక్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషాన్ భారీ పరుగులు చేసినా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో భారత్ 175పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో శివమ్ దూబే 17 బంతుల్లో 27 పరుగులు , రింక్ సింగ్ 4 బంతుల్లో 11 పరుగులు చేశారు. ఓ దశలో 200 పరుగులు దాటుతుందనుకున్నా స్కోర్ 175 పరుగులకు పరిమితం అయింది.