HomeతెలంగాణCyber ​​criminals | భారత్ - పాక్ పోరు.. సందట్లో సడేమియాలా సైబర్ నేరగాళ్ల దోపిడీ

Cyber ​​criminals | భారత్ – పాక్ పోరు.. సందట్లో సడేమియాలా సైబర్ నేరగాళ్ల దోపిడీ

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Cyber ​​criminals : భారత్​ – పాకిస్తాన్​ నడుమ ఓ వైపు భీకర పోరు కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల అమాయక ప్రజలే లక్ష్యంగా పాక్​ డ్రోన్లతో దాడికి తెగబడుతోంది. భారత్​ indian army వాటిని దీటుగా ఎదుర్కొని నేలమట్టం చేస్తోంది. దీంతో పాటు ప్రతిదాడులు కొనసాగిస్తోంది.

ఇదిలా ఉండగా.. సందట్లో సడేమియాలా సైబర్​ నేరగాళ్లు cyber criminals fake messages విజృంభిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త మోసానికి తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ అమాయకులకు ఫోన్​ చేస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ rtc MD VC Sajjanar స్పందించారు. ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేశారు. నకిలీ అధికారులను నమ్మొద్దని హెచ్చరించారు. డోనేషన్ల పేరుతో ఫోన్లు వస్తే స్పందించవద్దని సూచించారు.