HomeUncategorizedIndian Economy | జపాన్‌ను వెనక్కినెట్టి.. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

Indian Economy | జపాన్‌ను వెనక్కినెట్టి.. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Indian Economy | మన ఆర్థిక వ్యవస్థ(Economy) రోజురోజుకు బలోపేతం అవుతోంది. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ఐఎంఎఫ్‌(IMF) అంచనాల మేరకు భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్‌(NITI Aayog) సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం సైతం ప్రకటించారు. మన దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్‌ డాలర్లు దాటడంతో అమెరికా, చైనా, జర్మనీల తర్వాతి స్థానంలో నిలిచింది. మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం వంటి చర్యల ద్వారా మరో మూడేళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో మూడో స్థానానికి చేరుకుంటామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) నామినల్‌ జీడీపీ(Nominal GDP) డాటా ప్రకారం టాప్‌ 5 ఆర్థిక వ్యవస్థల గురించి తెలుసుకుందామా..

Indian Economy | అమెరికా(America)

ఐఎంఎఫ్‌(IMF) అంచనాల ప్రకారం యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా(US) ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. యూఎస్‌ నామినల్‌ జీడీపీ 30.507 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. గత శతాబ్ద కాలంలో అమెరికానే టాప్‌ పొజిషన్‌లో ఉంటుండడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో ఆ దేశాన్ని వెనక్కి నెట్టే ఆర్థిక వ్యవస్థ కనిపించడం లేదు. సేవలు, టెక్నాలజీ, ఫైనాన్స్‌, టెక్‌ ఇన్నోవేషన్‌ వంటివి ఆ దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతున్నాయి.

Indian Economy | చైనా(China)

కొన్ని దశాబ్దాలుగా వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న చైనా(China).. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఆ దేశ నామినల్‌ జీడీపీ 18.270 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. తయారీ, ఎగుమతులు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులతో చైనా దూసుకెళ్తోంది. కానీ వాణిజ్య, సరిహద్దు ఉద్రిక్తతలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలు ప్రతిబంధకాలుగా మారే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Indian Economy | జర్మనీ (Germany)

4.744 ట్రిలియన్‌ డాలర్ల నామినల్‌ జీడీపీతో జర్మనీ(Germany) అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆటోమొబైల్స్‌, ఇంజినీరింగ్‌, కెమెకల్స్‌ రంగాలలో ప్రగతితో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, నూతన ఆవిష్కరణలు, ఎగుమతులు ఆ దేశ బలం. అయితే దేశ జనాభాలో వృద్ధులు ఎక్కువగా ఉండడం ఆ దేశానికి సవాల్‌గా మారుతోంది.

Indian Economy | భారత్‌(Bharath)

రూ. 4.187 ట్రిలియన్‌ డాలర్ల నామినల్‌ జీడీపీతో ఇటీవలే జపాన్‌ను అధిగమించి భారత్‌ మూడో స్థానానికి చేరింది. సేవలు, ఐటీ, వ్యవసాయం, తయారీ రంగాలలో గణనీయమైన వృద్ధితో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోంది. మేకిన్‌ ఇండియా పాలసీ మేలు చేస్తోంది. యువశక్తి భారత్‌(India)గా మరో బలం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తున్న భారత్‌.. మరో మూడేళ్లలో జర్మనీని అధిగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో మూడో స్థానానికి చేరే అవకాశాలున్నాయి.

Indian Economy | జపాన్‌(Japan)

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో జపాన్‌(Japan) ఐదో స్థానానికి పడిపోయింది. ఆ దేశ నామినల్‌ జీడీపీ 4.186 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఎలక్ట్రానిక్స్‌(Electronics), రోబోటిక్స్‌(Robotics)లలో బలమైన తయారీ రంగంతో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. అయితే ఈ దేశ జనాభాలో సైతం యువత తక్కువగా ఉండడం, వృద్ధులు ఎక్కువగా ఉండడం ప్రతికూలాంశాలు.