అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs WI | వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా విజయానికి అంచున నిలిచింది. 121 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.
క్రీజులో కేఎల్ రాహుల్ (KL Rahul) (25), సాయి సుదర్శన్ (30) అజేయంగా కొనసాగుతున్నారు. ఇక విజయానికి భారత్‌కు ఇంకా 58 పరుగులు అవసరం. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్(8)ను వారికన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ కావవడంతో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
IND vs WI | గెలుపునకు దగ్గరగా..
అంతకుముందు 173/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జాన్ కాంప్‌బెల్ (115), షైహోప్ (Shai Hope) (103) జోడీ అద్భుతమైన సెంచరీలతో జట్టును నిలబెట్టగా, జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. జైడెన్ సీల్స్‌తో (32) కలిసి ఆఖరి వికెట్‌కు 79 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. భారత్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) (3/44), కుల్దీప్ యాదవ్ (3/104)* తలా మూడు వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ సాధించారు.
వెస్టిండీస్ బ్యాటర్లు (West Indies batsmens) ముఖ్యంగా కాంప్‌బెల్, హోప్ జోడీ మొదటి సెషన్‌లో భారత బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం విండీస్‌కు అనుకూలంగా మారింది. లంచ్ బ్రేక్ సమయానికి 252/3 స్కోర్ వద్ద ఉన్న విండీస్, రెండో సెషన్‌లో సిరాజ్ బౌలింగ్‌లో షైహోప్ వికెట్ కోల్పోయిన తర్వాత ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), బుమ్రా మిగిలిన బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌కు చేర్చారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 వద్ద డిక్లేర్ చేయగా, విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం 121 పరుగుల లక్ష్యానికి మరో 58 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా, ఐదో రోజు ఉదయం త్వరితగతిన పరుగులు సాధించి సిరీస్‌ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ కానుంది.