అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA | భారత్–దక్షిణాఫ్రికా రెండో టీ20లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 214 పరుగుల భారీ లక్ష్య ఛేజింగ్‌లో భారత్ చివరి 5 వికెట్లను కేవలం 9 బంతుల వ్యవధిలో 5 పరుగులకే కోల్పోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. 17.4 ఓవర్ల వరకు భారత జట్టు 5 వికెట్లకు 157 పరుగులు చేసింది.
ఓ దశలో భారత్ పటిష్ట స్థితిలో కనిపించిన ఒక్కసారిగా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో భారత్ దారుణమైన ఓటమిని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు భారత బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి వికెట్లు తీసుకున్నారు. దీంతో సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 చరిత్రలో భారత జట్టుపై ఒక మ్యాచ్‌లో పదికి పది వికెట్లను పేసర్లు తీసిన అరుదైన సంఘటన ఇదే మొదటిసారి.
IND vs SA | చెత్త బ్యాటింగ్
దక్షిణాఫ్రికా (South Africa ) పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో భారత బ్యాటింగ్ పూర్తిగా కుదేలైంది. ఒకే ఓవర్లో, ముఖ్యంగా 19వ ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత జట్టు (Team India) పతనాన్ని శాసించాడు బార్ట్‌మన్. అతని గణాంకాలు భారత్‌పై టీ20ల్లో దక్షిణాఫ్రికా బౌలర్లలో ఉత్తమ ప్రదర్శనగా నమోదయ్యాయి. ఈ విజయంతో దక్షిణాఫ్రికా భారత్‌పై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. మొత్తం 13 విజయాలతో ఆస్ట్రేలియా (12) రికార్డును అధిగమించింది. తొలి టీ20లో విజయంతో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్, రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా విఫలమై సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు.
చివరి దశలో జితేష్ శర్మ, తిలక్ వర్మ (Tilk Varma) కూడా నిలవలేకపోవడంతో భారత్ భారీ లక్ష్యానికి చాలా దూరంలోనే ఆగిపోయింది. ముఖ్యంగా పేసర్లు ఆధిపత్యం చెలాయించడంతో దక్షిణాఫ్రికా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ చెత్త బౌలింగ్ చేసి ఆగ్రహానికి గురయ్యాడు. కోచ్ గంభీర్ (Coach Gambhir) కూడా అర్ష్‌దీప్ బౌలింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌తో అర్ష్‌దీప్ చెత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు.
IND vs SA | అంతర్జాతీయ టీ20ల్లో అతిపెద్ద ఓవర్
అర్ష్‌దీప్ సింగ్ 13 బంతులు 18 పరుగులు దక్షిణాఫ్రికా న్యూ చండీగఢ్, 2025
నవీన్-ఉల్-హక్ 13 బంతులు 19 పరుగులు జింబాబ్వే హరారే, 2024
సిసాండ మగాలా 12 బంతులు 18 పరుగులు పాకిస్తాన్ జోహన్నెస్‌బర్గ్, 2021
మార్క్ అడైర్ 11 బంతులు 26 పరుగులు ఆస్ట్రేలియా బ్రిస్బేన్, 2022