ePaper
More
    Homeక్రీడలుAnderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    Anderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anderson-Tendulkar Trophy : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్​ (England) తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్​లో టీమిండియా team India ఓటమి చెందింది. భారత్​ జట్టు Indian team నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్​ జట్టు 5 వికెట్లు కోల్పోయి అవలీలగా ఛేదించింది.

    ఓపెనర్ బెన్ డకెట్ Ben Duckett (149, 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో బంతిని ఓ ఆట ఆడుకున్నాడు. జాక్ క్రాలీ (65), జో రూట్ (53*; 84 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. బెన్ స్టోక్స్ (33, 51 బంతుల్లో 4 ఫోర్లు) కూడా బెటర్​గానే రాణించాడు. చివరలో జేమీ స్మిత్ (44, 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.

    రెండో ఇన్నింగ్స్ లో 21/0 ఓవర్​నైట్​ స్కోరుతో అయిదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. తొలి సెషన్​లో ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా 96 పరుగులు చేసింది. రెండో సెషన్​లో ఆతిథ్య జట్టు క్రికెటర్లు 152 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయారు.

    జాక్ క్రాలీ Jack Crawley, తర్వాత వచ్చిన ఓలీ పోప్ (8)ని ప్రసిద్ధి కృష్ణ పెవిలియన్​కు పంపించేశాడు. క్రాలీ, డకెట్ తొలి వికెట్​కు 188 పరుగుల భాగస్వామ్యంతో ఆడారు. డకెట్ 121 బంతుల్లోనే శతకం చేశాడు. సెంచరీ తర్వాత జోరు పెంచాడు. కానీ, టీ విరామానికి ముందే డకెట్, హ్యారీ బ్రూక్ (0)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.

    ఇక మ్యాచ్​ భారత్ చేతిలోకి వచ్చిందనుకునే తరుణంలో స్టోక్స్, రూట్ నిలకడగా ఆడి ఇన్నింగ్​ను వారి చేతుల్లోకి తీసుకున్నారు. జడేజా బౌలింగ్​లో స్టోక్స్ వెనుదిరిగినా రూట్, జేమీ స్మిత్ జట్టును నిలబెట్టారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...