అక్షరటుడే, వెబ్‌డెస్క్: Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా బిడ్‌ను ఆమోదించింది.
గుజరాత్ Gujarat రాజధాని అహ్మదాబాద్ (Ahmedabad) ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం Union Cabinet బుధవారం (ఆగస్టు 27) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఒకవేళ క్రీడల Commonwealth Games నిర్వహణకు భారత్‌కు అవకాశం లభిస్తే గుజరాత్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడానికి కూడా ఆమోదం తెలిపింది.
బిడ్ ఎంపికైతే మన దేశానికి రెండోసారి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించే అవకాశం లభిస్తుంది. గతంలో 2010లో న్యూఢిల్లీ కేంద్రంగా ఈ పోటీలు నిర్వహించారు.
ఇండియాతో పాటు కెనడా, నైజీరియా పోటీలో ఉన్నాయి. 2030 క్రీడలకు ఆతిథ్య దేశంపై నిర్ణయం రాబోయే సంవత్సరంలో ప్రకటించే అవకాశం ఉంది.
Commonwealth Games | అతిపెద్ద స్టేడియం కావడంతో..
అహ్మదాబాద్‌ను ఎంపిక చేయడానికి అక్కడున్న మౌలిక వసతులే కారణం. అహ్మదాబాద్‌లో వరల్డ్ క్లాస్ స్టేడియంలు, అత్యాధునిక ట్రైనింగ్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ పట్ల ఉన్న ప్యాషన్ సహా అనేకం ఉన్నాయి.
నరేంద్ర మోడీ స్టేడియం కూడా ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. 2023 వన్డే ప్రపంచ కప్ World Cup ఫైనల్ నిర్వహణతో ఈ స్టేడియం ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
అలాగే, 2022, 2023, 2025 IPL ఫైనల్స్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చింది. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులు లభిస్తే అహ్మదాబాద్ మరో ఘనత సాధించినట్లవుతుంది.
కామన్వెల్త్ క్రీడలు విజయవంతంగా పూర్తయితే, ఇండియా 2036లో లేదా సమీప భవిష్యత్తులో ఒలింపిక్స్ Olympics నిర్వహణకు కూడా బిడ్ వేసే అవకాశముంది.
Commonwealth Games | పాల్గొననున్న 72 దేశాలు
కామన్వెల్త్ పోటీల్లు 72 దేశాల క్రీడాకారులు పాల్గొననున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే క్రీడాకారులతో పాటు సందర్శకులను వసతి కల్పించడానికి అహ్మదాబాద్‌లో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
క్రీడల నిర్వహణతో వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. అలాగే, పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుంది. రవాణా, మీడియా, ఈవెంట్ మేనేజ్‌మెంట్, సమాచార సాంకేతికత వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
“భారతదేశంలో కామన్వెల్త్ గ్రేమ్స్ నిర్వహించడం వల్ల పర్యాటకం వృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే లక్షలాది మంది యువ అథ్లెట్లకు ఇవి స్ఫూర్తినిస్తాయి. దానితో పాటు, స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్లు, బ్రాడ్‌కాస్ట్ అండ్ మీడియా, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇతర రంగాలలో కూడా పెద్ద సంఖ్యలో నిపుణులు అవకాశాలను పొందుతారు” అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.