అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జీఎస్టీ సంస్కరణలు (GST Reform) తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ప్రధాని మోడీ (PM Modi), ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) చిత్రపటాలకు సోమవారం గాంధీచౌక్‌లో పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలు వినియోగించే వస్తువులపై భారీ పన్ను ఊరట కల్పించడం హర్షణీయమన్నారు. వ్యాపార రంగాలకు మోదీ సర్కార్ దీపావళి కానుక ప్రకటించిందన్నారు. ప్రధానంగా ఆరోగ్య, జీవిత బీమాలతో పాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.
BJP Nizamabad | విద్యారంగ సామగ్రిపై..
విద్యారంగ సామగ్రిపై జీరో జీఎస్టీ (ZERO GST), ఆటోమొబైల్స్(Automobiles), ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై (Electronic products) 28 శాతం నుంచి 18 శాతం తగ్గించారని ఇది రాబోయే నూతన సాంకేతిక రంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వంటి నాయకులకు ఈ నిర్ణయం చెంపపెట్టు లాంటిదన్నారు. 2047 వరకు భారత్‌ను ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు బంటు రాము, న్యాలంరాజు, జ్యోతి, వనిత, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.