ePaper
More
    Homeఅంతర్జాతీయంMinister Rajnath Singh | అభివృద్ధిలో భారత్.. సంక్షోభంలో పాక్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు...

    Minister Rajnath Singh | అభివృద్ధిలో భారత్.. సంక్షోభంలో పాక్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు రాజ్ నాథ్ కౌంటర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Rajnath Singh | భారత ఆర్థిక వ్యవస్థను “మెర్సిడెస్”(Mercedes)తో, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను “కంకరతో నిండిన చెత్త ట్రక్కు”తో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Pak Army Chief General Asim Munir) ఇటీవల చేసిన వ్యాఖ్యకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

    మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆర్థిక బలహీనతను అంగీకరించడమేనన్నారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025లో ప్రసంగించిన ఆయన..రెండు దేశాలు ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందినప్పటికీ, ఇండియా మంచి విధానాలు, దూరదృష్టి ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుందని గుర్తు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్(Pakistan) తన సొంత వైఫల్యాల కారణంగా సంక్షోభంలో చిక్కుకుపోయిందని విమర్శించారు.

    Minister Rajnath Singh | ప్రతిస్పందించేందుకు సిద్ధం..

    మునీర్ వ్యాఖ్యలను కేవలం ట్రోలింగ్ గా తోసిపుచ్చకూడదని, హెచ్చరికగా చూడాలని సింగ్ హెచ్చరించారు. “మనం దీనిని తీవ్రంగా పరిగణించి తదనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంది. పాకిస్తాన్ ఏం చేసినా భారత్ తగిన ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంది” అని పేర్కొన్నారు. “ఈ తీవ్రమైన హెచ్చరిక వెనుక ఉన్న చారిత్రక సూచనను మనం గమనించకపోతే, అది మనకు ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. మనం దీనిపై దృష్టి సారించాలి. పాక్ దేనికైనా సిద్ధమైతే, అటువంటి వాటికి మనం తగిన సమాధానం ఇవ్వగలమని” అని తెలిపారు.

    Minister Rajnath Singh | అమెరికాకూ రాజ్​నాథ్ కౌంటర్

    భారత్ మాత్రమే ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయగలదని రాజ్​నాథ్(Minister Rajnath Singh) అన్నారు. ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయం వల్ల అనేక దేశాలు గణనీయంగా ప్రభావితమైనప్పుడు, ఇండియా దాన్ని బలోపేతం చేయగలదని ట్రంప్ టారిఫ్​ల గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నేడు ప్రపంచంలోని పెద్ద దేశాలు చైనా ప్లస్ గురించి మాట్లాడుతాయి. కానీ, భారతదేశం(India) కాకుండా వేరే ఏ దేశం ఈ పని చేయగలదని ప్రశ్నించారు. మన దేశ స్వావలంబన గురించి మాట్లాడేటప్పుడు, అది కేవలం దిగుమతి ప్రత్యామ్నాయ విధానం మాత్రమే కాదు, దాని వెనుక ప్రపంచ మంచి భావన కూడా ఉందన్నారు. దాని వెనుక ప్రపంచానికి బలమైన సరఫరా గొలుసును అందించాలనే భావన ఉందని ఆయన అన్నారు.

    ప్రపంచవ్యాప్తంగా ఇండియాపై విశ్వాసం ఉందన్న రక్షణ శాఖ మంత్రి… భారతదేశం గ్లోబల్-AI-హబ్​గా మారాలని మేము కోరుకుంటున్నామని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం సెమీకండక్టర్లపై పనిని మిషన్ మోడ్​లో ముందుకు తీసుకెళ్లింది. ప్రధానమంత్రి(Prime Minsiter) తన స్వాతంత్య్ర  దినోత్సవ ప్రసంగంలో చెప్పినట్లుగా, ఈ సంవత్సరం చివరి నాటికి, మనం తయారు చేసిన ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్లు మార్కెట్లోకి ప్రవేశిస్తాయి” అని తెలిపారు. భారతదేశ శక్తివంతమైన రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి అన్ని విదేశీ కంపెనీలు ముందుకు రావాలని సింగ్ పిలుపునిచ్చారు.

    Latest articles

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు...

    Yedla polala Amavasya | రైతులను ఆదరిద్దాం.. వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం: గడుగు గంగాధర్​

    అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State...

    Sriram Sagar reservoir | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎనిమిది గేట్ల మూసివేత.. ఇంకా ఎన్ని ఓపెన్​ ఉన్నాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriram Sagar reservoir : ఉత్తర తెలంగాణ (Telangana) వరప్రదాయిని శ్రీరామ్​ సాగర్​ జలాశయాని(Sriram Sagar...

    More like this

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు...

    Yedla polala Amavasya | రైతులను ఆదరిద్దాం.. వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం: గడుగు గంగాధర్​

    అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State...