ePaper
More
    Homeఅంతర్జాతీయంDog Bite | ఇండియాలోనే అత్య‌ధికంగా కుక్క‌ల బెడ‌ద‌.. నిమిషానికి 6 కుక్క‌కాటు కేసులు

    Dog Bite | ఇండియాలోనే అత్య‌ధికంగా కుక్క‌ల బెడ‌ద‌.. నిమిషానికి 6 కుక్క‌కాటు కేసులు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Dog Bite : అభివృద్ధి ప‌రుగులు పెడుతున్న భార‌త్ (India) వివిధ రంగాల్లో త‌న‌దైన ముద్ర వేస్తూ ప్ర‌పంచంలోనే ముందు వ‌రుసలో నిలుస్తోంది. అభివృద్ధిలో ఎన్నో రికార్డులు సాధిస్తున్న భార‌త్‌.. ఓ చెత్త మైలురాయిని సైతం త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా కుక్క‌ల బెడ‌ద ఉన్న దేశంగా పేరొందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంభ‌విస్తున్న కుక్క‌కాటు (రేబిస్) (rabies) మ‌ర‌ణాల్లో 36 శాతానికంటే ఎక్కువ‌గా భార‌త్‌లో న‌మోద‌వుతున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.

    Dog Bite : మ‌ర‌ణాలు ఎక్కువే…

    మ‌న దేశంలోనే వీధికుక్క‌ల బెడ‌ద తీవ్రంగా ఉంది. మిగ‌తా దేశాల్లో కంటే భార‌త్‌లోనే కుక్క‌కాట్లు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌న దేశంలో ప్ర‌తి నిమిషానికి ఆరు కుక్క కాటు కేసులు న‌మోదవుతుండ‌డం క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. అదే స‌మ‌యంలో రేబిస్ మ‌ర‌ణాలు కూడా మ‌న ద‌గ్గ‌రే ఎక్కువ‌గా చోటు చేసుకుంటున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) వెల్ల‌డించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంభ‌విస్తున్న కుక్క‌కాటు మ‌ర‌ణాల్లో 36 శాతానికి పైగా ఇండియాలోనే న‌మోద‌వుతున్నాయ‌ని పేర్కొంది. ఈ గ‌ణంకాలు మ‌న దేశంలో కుక్క‌ల బెడ‌ద‌కు అద్దం ప‌డుతున్నాయి.

    Dog Bite : నియంత్ర‌ణ లేక‌..

    మ‌న దేశంలో వీధికుక్క‌ల‌పై నియంత్ర‌ణ లేకుండా పోయింది. ఫ‌లితంగా వాటి సంఖ్య విప‌రీతంగా పెరుగుతూ పోతోంది. ప‌ట్ట‌ణాలే కాకుండా ప‌ల్లెల్లోనూ శున‌కాలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ క‌న‌బ‌డిన వారిపై దాడులు చేస్తున్నాయి. ఫ‌లితంగా నిమిషానికి 6 కుక్క‌కాటు కేసులు న‌మోద‌వుతున్నాయి. ప‌రిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా శున‌కాల సంఖ్య‌ను నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వాలు పెద్ద‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. కుక్క‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ చికిత్స‌లు చేయ‌డం ద్వారా శున‌కాల సంఖ్య‌ను ప‌రిమితం చేయ‌వ‌చ్చు. కానీ ప్ర‌భుత్వాలు ఆ దిశ‌గా దృష్టి సారించ‌డం లేదు.

    More like this

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...