ePaper
More
    Homeఅంతర్జాతీయంIndian army | పాక్‌లో ఎక్క‌డైనా దాడి చేసే స‌త్తా ఉంది.. ఎయిర్ డిఫెన్స్ డీజీ...

    Indian army | పాక్‌లో ఎక్క‌డైనా దాడి చేసే స‌త్తా ఉంది.. ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian army | పాకిస్తాన్‌లోని ఏ మూల అయినా దాడి చేయ‌గ‌ల సామ‌ర్థ్యం భార‌త్‌కు ఉంద‌ని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్(Director General of Army Air Defence) లెఫ్టినెంట్ జనరల్ సుమెర్ ఇవాన్ డి కున్హా వెల్ల‌డించారు. పాక్‌లో ఏ క‌లుగులో దాక్కున్నా బ‌య‌ట‌కు తీసుకొచ్చే స‌త్తా ఇండియాకుంద‌ని స్ప‌ష్టం చేశారు. పాకిస్తాన్‌(Pakistan)లోని రావ‌ల్పిండి నుంచి ఖైబ‌ర్ ఫ‌క్తున్కా(Khyber Pakhtunkhwa) వ‌ర‌కూ ఎక్క‌డైనా దాడి చేయ‌గ‌ల‌మ‌ని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ అనంత‌రం ఆయ‌న వార్తా ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. అవసరమైతే పాకిస్తాన్ భూభాగం అంతటా దాడి చేయ‌డానికి భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

    Indian army | పాక్ మొత్తం మ‌న ప‌రిధిలోనే..

    మ‌న స‌రిహ‌ద్దుల నుంచే పాకిస్తాన్‌(Pakistan)లో ఏ మూల‌న ఉన్న టార్గెట్‌ను అయినా ఛేదించ‌గ‌ల సత్తా భార‌త త్రివిధ ద‌ళాలకు ంద‌ని లెఫ్టినెంట్ జనరల్ డి కున్హా తెలిపారు. “మొత్తం పాకిస్తాన్ పరిధిలోనే ఉంది” అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సైన్యం తన జనరల్ హెడ్‌క్వార్టర్స్ (GHQ)ను రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా (KPK) వంటి ప్రాంతాలకు తరలించినప్పటికీ మ‌న టార్గెట్‌లోనే ఉన్నార‌ని చెప్పారు. అందుకు బ‌దులుగా పాకిస్తాన్ ఆర్మీ(Pakistan Army) ఏదైనా క‌లుగు చూసుకుని అందులో దాక్కోవాల‌ని ఎద్దేవా చేశారు. “పాకిస్తాన్‌ను ఎదుర్కోవడానికి భారతదేశం వద్ద తగినంత ఆయుధ సామ‌ర్థ్యం ఉంది. విశాలమైన ప్రాంతం నుంచి ఇరుకైన ప్రాంతం వరకు, అది ఎక్కడ ఉన్నా, పాకిస్తాన్ మొత్తం మ‌న పరిధిలోనే ఉంది. మొత్తం పాకిస్తాన్‌ను ఎదుర్కోగల సామర్థ్యం మాకు ఉంది. జ‌న‌ర‌ల్ హెడ్‌క్వార్ట‌ర్స్‌ను రావల్పిండి నుంచి KPKకి లేదా వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లవచ్చు, కానీ అవన్నీ మ‌న పరిధిలోనే ఉన్నాయి, కాబట్టి వారు ఏదైనా క‌లుగు వెతుక్కుని అందులో దాక్కోవాల్సిందే ” అని లెఫ్టినెంట్ జనరల్ డి’కున్హా తెలిపారు.
    అవే కీల‌కం..
    భారత దళాలు స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాయని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వివ‌రించారు. వీటిలో దీర్ఘ-శ్రేణి డ్రోన్‌లు(Long-range drones) గైడెడ్ మందుగుండు సామగ్రి ఉన్నాయని, ఇవి ఆపరేషన్‌లో పాత్ర పోషించాయని ఆయన అన్నారు. దేశాన్ని, ప్రజలను రక్షించే బాధ్యత సాయుధ దళాలదేనని లెఫ్టినెంట్ జనరల్ డి కున్హా కూడా అన్నారు. “మన సార్వభౌమత్వాన్ని, మన ప్రజలను కాపాడుకోవడమే మన పని. జనాభా కేంద్రాలలో, మన కంటోన్మెంట్ల(Cantonments)లో చాలా సమస్యలను సృష్టించే లక్ష్యంతో జరిగిన పాక్ దాడి నుంచి మన మాతృభూమిని మనం రక్షించుకోగలిగాం. మన ప్రజలకు, మన పౌర జనాభాకు మాత్రమే కాకుండా, మన జవాన్లు, అధికారులు, వారి కుటుంబాలు చాలా మంది కంటోన్మెంట్లలో ఉంటున్నారు. వారికి మేము స్ప‌ష్ట‌మైన ర‌క్ష‌ణ హామీ ఇచ్చాము. పాక్ డ్రోన్ దాడుల నుంచి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నాం. ఇది సైనికుడిని గర్వపడేలా చేయడమే కాకుండా కుటుంబాలను గర్వపడేలా చేసింది. చివరకు, భారతదేశ జనాభా కూడా గర్వంగా భావిస్తుందని” తెలిపారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో ఆధునిక యుద్ధంలో, ముఖ్యంగా డ్రోన్లు, ఇతర అధునాతన సాంకేతికతలను తటస్థీకరించడంలో భారత సంసిద్ధ‌త‌ను డి కున్హా హైలైట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణతో పాటు ఇజ్రాయెల్ పోరాటంలో డ్రోన్లకు ఉన్న అపారమైన సామర్థ్యం గురించి మేము ఎంతో నేర్చుకున్నామ‌ని చెప్పారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...