HomeUncategorizedMohan Bhagwat | భారత్ అంటే భయపడే సుంకాలు.. అమెరికా తీరును ఎండగట్టిన మోహన్ భగవత్

Mohan Bhagwat | భారత్ అంటే భయపడే సుంకాలు.. అమెరికా తీరును ఎండగట్టిన మోహన్ భగవత్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohan Bhagwat | భారతదేశం బలంగా అభివృద్ధి చెందితే తమకు ఏమి జరుగుతుందోనని అమెరికాకు భయం పట్టుకుందని, అందుకే ఇండియాపై సుంకాలు విధించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) వ్యాఖ్యానించారు.

నాగపూర్​లో (Nagpur) శుక్రవారం జరిగిన బ్రహ్మకుమారీల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమెరికా తీరును దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలు స్వార్థపూరిత విధాన ఫలితమని ఆయన దేశం పేరు చెప్పకుండానే అన్నారు. “మనలో శత్రుత్వం లేకపోతే, ఎవరూ మనకు శత్రువులు కాదు. గతంలో, పాములకు భయపడేవాళ్లం. విజ్ఞానం పెరిగిన తర్వాత, అన్ని పాములు విషపూరితమైనవి కాదని గ్రహించాము. అందుకే మేము పాములను ఒంటరిగా వదిలివేయడం ప్రారంభించాము. జ్ఞానం కారణంగా, భయం, వివక్షత నాశనం చేయబడ్డాయి” అని భగవత్ పేర్కొన్నారు.

Mohan Bhagwat | భయపడ్డారు కాబట్టే..

ఇండియా (India) అభివృద్ధి చెందితే ఏం జరుగుతోందనని భయపడే సుంకాలు (Tariffs) విధించారన్న మోహన్ జీ.. ఇలా ఎందుకు చేయాలని ప్రశ్నించారు. సప్త సముద్రాలు ఉన్న మీరు భయపడుతున్నారన్నారు. “భారతదేశం అభివృద్ధి చెందితే ఏమి జరుగుతుంది? కాబట్టి సుంకాలు విధించారు. ఎందుకు ఇలా చేయాలి? మీరు ఏడు సముద్రాల ఆవల ఉన్నారు. కానీ ‘నేను, నాది’ అనే స్వలాభం కారణంగానే మీరు భయపడుతున్నారు.. వారు అసంపూర్ణ దృష్టి ఆధారంగా ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు, కానీ, పరిష్కారం కనుగొనబడలేదు. ఈ రోజు ప్రపంచానికి ఒక పరిష్కారం అవసరం.” అని ఆయన వ్యాఖ్యానించారు.