అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | ఇండియా, యూకే సహజ భాగస్వాములని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో ముంబైలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న అనంతరం మోదీ యూకే ప్రధానితో (UK Prime Minister) కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు.
భారతదేశం-యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య నెలకొన్న సంబంధాలు ప్రపంచ సంబంధాలకు శాశ్వత చిహ్నంగా నిలుస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ప్రస్తావిస్తూ, ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు రెండు దేశాల సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు.
సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (Trade Agreement) గురించి మాట్లాడుతూ, “ఈ ఒప్పందంతో (సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం), రెండు దేశాల మధ్య దిగుమతి ఖర్చు తగ్గుతుంది, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి, వాణిజ్యం పెరుగుతుంది ఇది మన పరిశ్రమలు, వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది నెలల్లోనే, ఇప్పటివరకు అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందం మీతో పాటు భారతదేశానికి మీరు రావడం భారతదేశం-యూకే భాగస్వామ్యంలో కొత్త ఉత్సాహానికి చిహ్నమని” ప్రధాని పేర్కొన్నారు.
PM Modi | పరస్పర విశ్వాసంతో..
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్దమైన పాలన వంటి విలువలపై ఇండియా, యూకే దేశాలు ముందుకు సాగుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. “భారతదేశం, యూకే సహజ భాగస్వాములు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్దమైన పాలన వంటి విలువలపై పరస్పర విశ్వాసం మన సంబంధాలను పటిష్టం చేస్తుంది. ప్రస్తుత ప్రపంచ అస్థిరత యుగంలో, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఈ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి ఒక ముఖ్యమైన పునాదిగా నిలుస్తుందని” అని ప్రధాన మంత్రి అన్నారు.
PM Modi | బలమైన ఆర్థిక శక్తిగా ఇండియా..
యూకే ప్రధాని స్మార్టర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని అవిశ్రాంత కృషి భారతదేశ ఆర్థిక స్థితిని ఏకీకృతం చేసిందన్నారు. ఇండియాను ప్రపంచంలోఏ ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా మార్చిందన్నారు. రెండు దేశాలు ‘ఏదో పెద్ద’ శిఖరాగ్రానికి చెందినవని ఆయన అన్నారు.