HomeUncategorizedPM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ స్పందించారు. భార‌త‌దేశానికి అమెరికా ఆత్మీయ మిత్ర దేశమ‌ని, రెండు దేశాలు స‌హ‌జ భాగ‌స్వాముల‌ని వ్యాఖ్యానించారు.

రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా కొలిక్కి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఎక్స్‌లో వెల్ల‌డించారు. వాణిజ్య చర్చలు భారతదేశం-అమెరికా(America) భాగస్వామ్యం అపరిమిత సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి మార్గం సుగమం చేస్తాయని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని తెలిపారు.

PM Modi | చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయ‌న్న ట్రంప్‌..

50 శాతం సుంకాల విధింపు త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య తీవ్ర ప్ర‌తిష్టంభన నెల‌కొంది. మొన్న‌టిదాకా భార‌త్‌(India)పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న రెచ్చిపోయిన ట్రంప్ స్వ‌రంలో చైనాలో జ‌రిగిన షాంఘై స‌మావేశం త‌ర్వాత స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే భార‌త్‌తో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను కొలిక్కి తెచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని తాజాగా చెప్పారు. భార‌త ప్ర‌ధాన‌మంత్రితో మాట్లాడేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని పేర్కొన్నారు. వాషింగ్టన్, ఢిల్లీ వాణిజ్య చర్చలు విజయవంతమైన ముగింపున‌కు వస్తాయని క‌చ్చితంగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు, రాబోయే వారాల్లో తన మంచి స్నేహితుడు అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi)తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నానని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

PM Modi | క‌లిసి ప‌ని చేస్తామ‌న్న మోదీ.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌(Social Media Post)పై ప్ర‌ధాని ప్రతిస్పందించారు. న్యూఢిల్లీ, వాషింగ్టన్ బృందాలు భారతదేశం-అమెరికా వాణిజ్య చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి కృషి చేస్తున్నాయన్నారు. “భారతదేశం, అమెరికా ఆత్మీయ మిత్రులు. సహజ భాగస్వాములు. మా వాణిజ్య చర్చలు భారతదేశం-అమెరికా భాగస్వామ్య అపరిమిత సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి మార్గం సుగమం చేస్తాయని విశ్వసిస్తున్నాను. ఈ చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. మా రెండు దేశాల ప్రజలకు ప్రకాశవంతమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును భద్రపరచడానికి మేము కలిసి పని చేస్తాము” అని ప్రధాని మోదీ X పోస్ట్‌లో పేర్కొన్నారు.