ePaper
More
    Homeక్రీడలుInd vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు...

    Ind vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind vs Eng | ఇంగ్లండ్‌తో England జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఓవ‌ల్ వేదిక‌గా చివ‌రి టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చేరువవుతోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత్ గట్టి పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల వెనుకబడినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి మ్యాచ్‌ను తన దిశగా తిప్పుకుంది. జైస్వాల్ సెంచరీ, ఆకాశ్ దీప్, జ‌డేజా, సుందర్ హాఫ్ సెంచరీలతో రాణించ‌గా, ఈ బ్యాటర్ల రాణింపు టీమిండియా విజ‌యంలో ముఖ్యపాత్ర పోషించనుంది. యశస్వి జైస్వాల్ (164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 118 ప‌రుగులు), ఆకాష్ దీప్ (94 బంతుల్లో 12 ఫోర్లతో 66 పరుగులు) చేయ‌గా, రవీంద్ర జడేజా (77 బంతుల్లో 53 పరుగులు (5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (46 బంతుల్లో 53 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతంగా రాణించారు.

    READ ALSO  ind vs eng | పోరాడుతున్న జడేజా, సుందర్​.. టీ బ్రేక్​ స‌మ‌యానికి భార‌త్ స్కోరు ఎంతంటే..!

    Ind vs Eng | ఏం చేస్తారో మ‌రి..!

    ఐదు వికెట్లు తీసిన జోష్ టంగ్ (5/125) ఇంగ్లండ్ బౌలింగ్‌లో కీలకంగా నిలిచాడు. అతనికి తోడుగా గస్ అట్కిన్సన్ (3/127) మరియు జెమీ ఓవర్టన్ (2/98) ప‌ర్వాలేద‌నిపించారు. అయితే భారత్​ బ్యాటింగ్ ముగిసిన తర్వాత, ఇంగ్లండ్‌కు గెలవాలంటే 374 పరుగుల భారీ లక్ష్యం కావాల్సి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి, 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేశారు. బెన్ డకెట్ – 34*, జాక్ క్రాలీ Crwaley – 14 పరుగులు చేశారు. ఇంగ్లండ్ గెల‌వ‌డానికి ఇంకా 324 పరుగులు అవసరం కాగా, భారత్‌కు కావాల్సిన‌వి 8 వికెట్లు మాత్ర‌మే. వోక్స్ గాయ‌ప‌డ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయ‌లేదు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా వోక్స్ గ్రౌండ్‌లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిస్తే ఐదు టెస్ట్‌ల సిరీస్ డ్రా అవుతుంది. భార‌త్ గెలుపోట‌ములు ఇప్పుడు భార‌త బౌల‌ర్స్ చేతిలో ఉంది.

    READ ALSO  WCL 2025 | నిరాశ‌ప‌రిచిన సీనియ‌ర్ ఆట‌గాళ్లు.. సిరీస్ నుండి ఔట్

    ఓవల్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్ ఛేజ్ రికార్డు 1902లో నమోదు కాగా, అప్పట్లో ఆస్ట్రేలియా Australia నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్నిఇంగ్లండ్ టీమ్ ఛేజ్ చేసింది. మ‌రి ఇప్పుడు ఇంగ్లాండ్ ఈ 374 పరుగులు ఛేజ్ చేయాలంటే 123 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇంగ్లాండ్‌కు అంత సులభం కాదు. ఓవ‌ల్ మైదానంలో 148 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో, 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజించింది ఒక్క‌సారి కూడా లేదు. ఇక్కడ 100 క‌న్నా ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు జర‌గ‌గా, చివరి ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ గెలిచింది కేవ‌లం 22 సార్లు మాత్రమే. మ‌రి ఈ రోజు ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో చూడాలి.

    READ ALSO  IND PAK Semi Finals | ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి సెమీస్‌కి వెళ్లిన భార‌త్.. రేపు పాక్‌తో మ్యాచ్ ఆడుతుందా?

    Latest articles

    BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ పోరుబాటు.. రేపు ఢిల్లీకి నేతల పయనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి...

    OBC National Conferences | 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభలు

    అక్షరటుడే, ఇందూరు: OBC National Conferences | మండల్ డే (Mandal Day) సందర్భంగా ఈనెల 7న గోవా(Goa)లో...

    MLC Kavitha | బీఆర్​ఎస్​ పెద్ద నాయకుడు నన్ను తిట్టిస్తున్నాడు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్​కు చెందిన కొందరు తనను తిట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...

    Mahavatar Narsimha | చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రం.. బాక్సాఫీస్‌ దుమ్ములేపుతున్న ‘మహావతార్ నరసింహ’

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Mahavatar Narsimha | తెలుగు సినీ రంగంలోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ప్రేక్షకుల...

    More like this

    BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ పోరుబాటు.. రేపు ఢిల్లీకి నేతల పయనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి...

    OBC National Conferences | 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభలు

    అక్షరటుడే, ఇందూరు: OBC National Conferences | మండల్ డే (Mandal Day) సందర్భంగా ఈనెల 7న గోవా(Goa)లో...

    MLC Kavitha | బీఆర్​ఎస్​ పెద్ద నాయకుడు నన్ను తిట్టిస్తున్నాడు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్​కు చెందిన కొందరు తనను తిట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...