అక్షర టుడే, ఇందల్వాయి: Pro Kabaddi Tournament | తెలంగాణ యువ ప్రో కబడ్డీ టోర్నమెంట్‌కు (Pro Kabaddi Tournament) ఇందల్వాయి తండాకు (Indalwai Thanda) చెందిన బానోత్ సురేష్ ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.
ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు టోర్నీ జరగనుందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారుడు సురేష్ యాదాద్రి యోదాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Ditchpally Government Junior College) ఇంటర్ చదువుతున్నాడు.
సురేష్ గతంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పలుమార్లు పాల్గొన్నాడు. యువకుడి ఎంపికవడంతో కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్ రెడ్డి, రాజ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే మెగా టోర్నీకి ఎంపికవడం అభినందనీయని వారు పేర్కొన్నారు.