అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai Gun Firing | నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవి తండా శివారులో 44వ జాతీయ రహదారిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవి తండా శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయిన దుండగులు బుధవారం ఉదయం చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద స్థానికులకు కనిపించారు.
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చంద్రాయన పల్లి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Indalwai Gun Firing | అసలేం జరిగిందంటే..
నిజామాబాద్ జిల్లా (Nizamabad district) ఇందల్వాయి మండలంలోని దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద మంగళవారం సాయంత్రం యూపీకి (Uttar Pradesh) చెందిన సల్మాన్ అనే వ్యక్తి లారీ నిలిపాడు. కాగా.. మరో లారీలో ఇద్దరు అక్కడికి వచ్చారు. వచ్చీ రాగానే మొదటి వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో సల్మాన్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం కాల్పులు జరిపిన దుండగులు చంద్రాయన్ పల్లి వద్ద లారీని వదిలేసి పారిపోయారు. కాగా, వీరి మధ్య ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.