Indalwai
Indalwai | ఎరువుల గోదాముల తనిఖీ

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలోని ఎరువుల గోదాములను (Fertilizer warehouses) అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని నల్లవెల్లి, ఇందల్వాయి సహకార సంఘాల పరిధిలోని గోడౌన్లను శనివారం పరిశీలించారు. తహశీల్దార్​ వెంకట్రావు (Tahsildar Venkat Rao), మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్​ ఆధ్వర్యంలో ఎరువుల నిల్వలను తెలుసుకున్నారు.

అనంతరం తహశీల్దార్​ మాట్లాడుతూ నిర్ణయించిన ధర ప్రకారమే రైతులకు ఎరువులు అమ్మాలని సూచించారు. ఎరువులు కొన్న ప్రతి రైతుకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులు సైతం అవసరం మేరకే ఎరువులు కొనాలని కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. ఆయన వెంట పీఏసీఎస్​ ఛైర్మన్లు గోవర్ధన్​ రెడ్డి, శ్రీనివాస్​ రెడ్డి అన్నారు.

ఆలూర్‌ పీఏసీఎస్‌ గోదాంలో..

ఆలూర్​మండల కేంద్రంలో గోదాములో రికార్డులను తనిఖీ చేస్తున్న తహశీల్దార్​ రమేశ్​, తదితరులు

అక్షరటుడే, ఆర్మూర్‌: ఆలూర్‌ మండలకేంద్రంలోని పీఏసీఎస్‌ గోదాంను తహశీల్దార్‌ రమేష్, ఏవో రాంబాబు శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఎరువుల నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. డీలర్లు ఈపాస్‌ సిస్టమ్‌ ద్వారా ఎరువులు విక్రయించాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్, ఎంపీడీవో గంగాధర్, ఏడీఏ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.