అక్షరటుడే, వెబ్డెస్క్: IND W vs SL W | తిరువనంతపురం Thiruvananthapuram వేదికగా శ్రీలంక మహిళా జట్టు Sri Lankan women’s team తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు Indian women’s team ఘన విజయం సాధించింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఉమెన్ ఇన్ బ్లూ 3-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. భారత జట్టు మహిళలు113 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది.
IND W vs SL W | లక్ష్య ఛేదనలో..
లక్ష్య ఛేదనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శించింది. 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా 79 పరుగులు చేసి అజేయంగా నిలబడింది. హర్మన్ ప్రీత్ కౌర్(21) కూడా రాణించింది. స్టార్ ప్లేయర్లు రోడ్రిగ్స్(9), స్మృతి మంధాన Smriti Mandhana (1) విఫలమయ్యారు.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపర్లను దెబ్బతీసింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీసుకుంది. శ్రీలంక బ్యాటర్ ఇమేషా దులాని 27 పరుగులతో టాప్లో నిలిచింది. హాసిని పెరీరా(25),కవిషా దిల్హరి(20) కూడా రాణించారు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ డిసెంబర్ 28న ఇదే వేదికగా జరగనుంది.