అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs SA | తొలి టీ20లో ఆసక్తి హీట్ పీక్స్‌లో ఉండగా గిల్–అభిషేక్ ఓపెనింగ్ కాంబో ఎలా పనిచేస్తోంది? సూర్యకుమార్ ఫామ్‌లోకి వస్తాడా? హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ మ్యాజిక్ చూపిస్తాడా? బుమ్రా–అర్ష్‌దీప్ డ్యుయో సౌతాఫ్రికా బ్యాటింగ్‌ను ఎలా అడ్డుకుంటుంది? అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ రోజు రాత్రే లభించనుంది.
మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుని జోష్ మీదున్న భారత్… ఇప్పుడు సౌతాఫ్రికాతో South Africa ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు కటక్ వేదికగా తొలి టీ20 ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరుజట్లకూ అత్యంత కీలకం. వరుస విజయాలతో శరవేగంగా దూసుకుపోతున్న టీమిండియా అదే ఉత్సాహాన్ని కొనసాగించాలనుకుంటుండగా, డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు ఎదురుదెబ్బ ఇవ్వాలని సౌతాఫ్రికా ప్రయత్నిస్తోంది.
IND vs SA | గాయాల తర్వాత శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా రీఎంట్రీ
టీమిండియా ప్రకారం ఈ మ్యాచ్ ప్రధాన ఆకర్షణ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులో చేరటం, హార్దిక్ పాండ్యా Hardik Pandya ఫిట్నెస్ సాధించి యాక్షన్‌లోకి వస్తుండటం. వన్డే & టెస్ట్‌లకు దూరమైపోయిన ఈ ఇద్దరు స్టార్లు కటక్ టీ20తో మళ్లీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వీరి రాకతో జట్టు కాంబినేషన్‌పై ఆసక్తి రెట్టింపైంది.
గిల్‌తో అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ప్రబలంగా కనిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రన్ల వెల్లువ కురిపించిన అభిషేక్ ఈ సిరీస్‌లో సూపర్ ఇంపాక్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానుండగా, ఈ సిరీస్ అతని కెరీర్‌కు కీలకం. గతకాలంగా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న సూర్యకు ఇది మేక్ఆర్ బ్రేక్ సిరీస్.
నాలుగో స్థానంలో టాలెంట్ తిలక్ వర్మ Tilak Varma బరిలోకి దిగనున్నాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీతో పాటు కుల్దీప్ యాదవ్ ఉన్నా… ఒకవేళ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించాలని నిర్ణయిస్తే కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
మూడో వన్డేలో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన కుల్దీప్ కి ఇటువంటి పరిస్థితి రావడం చర్చనీయాంశమే. వికెట్ కీపింగ్‌లో కూడా పోటీ నెలకొంది.సేఫ్ కీపింగ్ అవసరమైతే సంజూ శాంసన్, పవర్ హిట్టింగ్ కోరుకుంటే జితేష్ శర్మని ఎంపిక చేస్తారు. ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
భారత్ అంచనా తుది జట్టు
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ / సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ / అర్ష్‌దీప్ సింగ్
టీమిండియా స్క్వాడ్
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.