అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs Pak | క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్తాన్ పోరు ఫిబ్రవరి 15, 2026న డబుల్ ఎంటర్టైన్మెంట్గా మారబోతోంది. సాధారణంగా ఈ రెండు దేశాల మధ్య జరిగే ఒక్క మ్యాచ్‌కే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. అయితే ఈసారి ఒకే రోజున రెండు కీలక మ్యాచ్‌లు జరగడం విశేషం. ICC Men’s T20 World Cup 2026 లో భాగంగా భారత పురుషుల జట్టు–పాకిస్తాన్ జట్టు మధ్య మ్యాచ్ శ్రీలంకలోని R. Premadasa Stadium వేదికగా జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
IND vs Pak | బిగ్ ఫైట్..
అదే రోజున మధ్యాహ్నం మహిళల యువ జట్ల మధ్య కూడా మరో ఆసక్తికర పోరు జరగనుంది. Asian Cricket Council నిర్వహిస్తున్న “మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026”లో ఇండియా A – పాకిస్తాన్ A జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని Terdthai Cricket Ground లో మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. యువ క్రీడాకారిణులకు ఇది ప్రతిభ చాటుకునే కీలక వేదికగా భావిస్తున్నారు. కాగా, టీ20 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించాయి. భారత జట్టు మొదటి మ్యాచ్‌లో యుఎస్ఏపై 29 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత నమీబియాపై 93 పరుగుల భారీ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. +3.050 నికర రన్‌రేట్‌తో దూసుకుపోతోంది.