అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ 3rd T20 | భారత జట్టు మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ New Zealand ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా 11వ టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. గౌహతిలోని బర్సపారా Guwahati స్టేడియం Barsapara Stadium లో ఆదివారం న్యూజిలాండ్‌పై 3-0 ఆధిక్యంతో భారత్ విజయ పథంలో కొనసాగుతోంది. మొదటి మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక జనవరి 28న విశాఖపట్నంలో నాలుగో మ్యాచ్ జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, టీమిండియా కేవలం 10 ఓవర్లలో న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్(57) కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. అభిషేక్ 68 పరుగులు తీశాడు. బుమ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు.
IND vs NZ 3rd T20 | అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ
భారత్ జట్టు కేవలం 3.1 ఓవర్లలోనే అర్ధ సెంచరీని పూర్తి చేయడం ద్వారా.. టీ20లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీగా రికార్డు నెలకొల్పింది. 2023 సంవత్సరంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 3.4 ఓవర్లలో అర్ధ సెంచరీ చేసింది.
టీమిండియా రెండో వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన రికార్డులో అభిషేక్ ఉండటం గమనార్హం. 2007 సంవత్సరంలో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో అర్ధ సెంచరీ చేయడం గమనార్హం.