ePaper
More
    Homeక్రీడలుINDvsEND | న‌క్క జిత్తుల ఆట‌.. ఇంగ్లండ్ ఓపెన‌ర్‌పై ఫుల్ ఫైర్ అయిన గిల్

    INDvsEND | న‌క్క జిత్తుల ఆట‌.. ఇంగ్లండ్ ఓపెన‌ర్‌పై ఫుల్ ఫైర్ అయిన గిల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: INDvsEND | లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ (India-England Test match) మూడో రోజు చివర్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఆట ముగిసే సమయానికి ఇద్దరు జట్ల మధ్య మాటల యుద్ధం ముదిరి, మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Indian captain Shubman Gill) మరియు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ (Zak Crawley) మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడంతా హాట్ టాపిక్‌గా మారింది. మూడో రోజు చివరి ఓవర్లో, ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా, బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వేసిన ఓవర్లో క్రాలీ రెండు సార్లు స్టాన్స్ మార్చుతూ ఆలస్యం చేశాడు. దీన్ని గమనించిన గిల్, సూటిగా స్పందిస్తూ కొంతమంది అభిప్రాయంపై “టైమ్ వృథా చేయడం వలన మేము మరో ఓవర్ వేయలేకపోయాం” అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

    INDvsEND | హాలీవుడ్ స్టార్స్‌ని మించి..

    దీంతో మైదానంలో వాగ్వాదం చెలరేగింది. గిల్ (captain Shubman Gill) నుంచి కొన్ని గట్టిగానే వచ్చిన మాటలు జాక్ క్రాలీని విసిగించాయి. ఇదే సమయంలో బంతి చేతికి తగలడంతో క్రాలీ వైద్య సహాయం కోరగా… భారత ఆటగాళ్లు అపహాస్యంగా చప్పట్లు కొట్టడం మరింత దుమారం రేపింది. ఈ వివాదంపై ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్ టిమ్ సౌథీ స్పందిస్తూ, “నిన్న శుభ్‌మన్ గిల్ వెన్నునొప్పితో మసాజ్ చేయించుకున్నాడు. అప్పుడు మేమేమీ అనలేదు. ఇప్పుడు మా ఆటగాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటే ఫిర్యాదులు చేయ‌డం ఏంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే టెస్ట్ క్రికెట్‌లో (Test Cricket) చివరి గంటలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ టెన్షన్ ఆటలో భాగమే అని కూడా వ్యాఖ్యానించారు.

    అస‌లు ఏం జ‌రిగింది అంటే..భార‌త్ ఆలౌట్ అయ్యాక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. జస్‌ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. అయితే ఆట ముగిసే సమయం ఆసన్నం కావడంతో ఎక్కువ ఓవర్లు ఆడకుండా ఉండేందుకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ ప్రయత్నించారు. బుమ్రా రన్నప్ పూర్తి చేసిన తర్వాత మ‌ధ్య‌లో ఆపుతుండ‌డం చిన్న గాయానికి ఫిజియోలను పిలిచి హాలీవుడ్ న‌టుల‌ని గుర్తు చేశారు. ఆయ‌న న‌ట‌న‌ని చూసి భార‌త ఆట‌గాళ్ల సెటైర్స్ వేశారు. సిరాజ్ స్లెడ్జింగ్‌కి (Mohammed Siraj sledding) దిగ‌గా, శుభ్‌మ‌న్ గిల్ అయితే బూతు ప‌దాల‌తో జాక్ క్రాలీతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

    More like this

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...