అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs ENG | మహిళల వన్డే ప్రపంచ కప్ (Women’s ODI World Cup) లో భాగంగా ఆదివారం (అక్టోబరు 19) ఇండియా – ఇంగ్లాండ్ England మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
టీమిండియా Team India ఓపెనర్ స్మృతి నుందాన Smriti Nundana (88), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ Harmanpreet Kaur (70) రాణించడంతో ఈ మ్యాచ్ను భారత్ సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ, లోయర్ ఆర్డర్ విఫలం వల్ల 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చెందింది.
ఆరంభంలో పేలవంగా ఆడిన ఇంగ్లాండ్ బౌలర్లు మ్యాచ్ చివర్లో కట్టుదిట్టంగా ఆడటంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. తాజా ఓటమితో వన్డే ప్రపంచ కప్లో టీమిండియా ఇది వరుసగా మూడో ఓటమి. దీంతో టీమిండియా సెమీస్ ఆశలు క్లిష్టంగా మారాయి.
IND vs ENG | హోల్కర్ స్టేడియం వేదికగా..
ఇండోర్ (Indore) లోని హోల్కర్ స్టేడియం (Holkar Stadium) వేదికగా భారత్ – ఇంగ్లండ్ మహిళల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హీథర్ నైట్ Heather Knight (109) అదరగొట్టింది. ఓపెనర్ అమీ జోన్స్ (56) కూడా రాణించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు, శ్రీచరణి రెండు వికెట్లు తీశారు.
289 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన మహిళల భారత జట్టులో ఓపెనర్ ప్రతీకా రావల్ ఆరు పరుగులే ఔట్ అయ్యింది. మరో ఓపెనర్ స్మృతి మందాన దూకుడుగా ఆడింది.
దీప్తి శర్మ(50), హర్లీన్ డియోల్(24) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు మ్యాచ్ చివరలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.