అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs BAN | మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ league match రద్దయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అఫిషియల్స్ ప్రకటించారు.
గెలుపు ముంగిట ఉన్న భారత జట్టు విజయాన్ని వరుణుడు అడ్డుకున్నట్లు అయింది. గెలుపుతో లీగ్ దశను ముగిద్దామనుకున్న భారత జట్టు అమ్మాయిలకు నిరాశ తప్పలేదు.
నవీ ముంబయి Navi Mumbai లోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం Dr. DY Patil Sports Stadium లో ఆదివారం (అక్టోబరు 26) భారత్ – బంగ్లా మహిళల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IND vs BAN | ఓవర్ల కుదింపు..
బంగ్లా Bangladesh మహిళలు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను 27 ఓవర్లకు తగ్గించారు. భారత బౌలర్లు చెలరేగారు.
దీంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ Sharmin Akhtar (37), శోభన మోస్తరీ (26) రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు.
రాధా యాదవ్ మూడు వికెట్లు తీసుకుంది. శ్రీచరణి, దీప్తి శర్మ, రేణుకా సింగ్, అమన్ జోత్ కౌర్ ఒక్కో వికెట్ తీశారు. డక్ వర్త్ లూయిస్ మెథడ్ (డీఎల్ఎస్) Duckworth Lewis Method (DLS) లో భారత జట్టు టార్గెట్‌కు 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అమన్ జోత్ కౌర్ Amanjot Kaur – స్మృతి మందాన Smriti Mandhana భారత ఇన్నింగ్స్ మొదలెట్టారు.
స్మృతి (34)కి అమన్ జోత్ కౌర్ (15) భాగస్వామ్యం బాగుంది. భారత జట్టు 8.4 ఓవర్లలో 57 పరుగులు చేసింది. కాగా, అప్పుడే మరోసారి వర్షం పడటంతో ఆట ఆగింది.
వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విజయం ఎవరిని వరించకుండానే భారత్ – బంగ్లా లీగ్ మ్యాచ్ India-Bangla league match ముగిసింది.
