అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs AUS women విశాఖ Visakhapatnam వేదికగా నిర్వహించిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025) మ్యాచ్‌లో టీమిండియా (Team India) కు ఓటమి తప్పలేదు.
ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా (Australia) మధ్య జరిగిన పోరు చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని కంగారు మహిళలు 49 ఓవర్లలోనే ఛేదించారు.
IND vs AUS women | ఓపెనర్లు రాణించినా..
టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు ప్రతిక రావల్ (Pratika Rawal), స్మృతి మందాన (Smriti Mandhana) మంచి భాగస్వామ్యాన్ని ప్రదర్శించారు.
మందాన 66 బంతుల్లో (9 ఫోర్లు, 3 సిక్సర్లు) 80 పరుగులు చేసింది. ప్రతిక రావల్ 96 బంతుల్లో (10 ఫోర్లు, 1 సిక్సర్) 75 పరుగులు చేసింది.
చివరలో భారత్ జట్టు వేగంగా వికెట్లను కోల్పోవడంతో 48.5 ఓవర్లలో 330 రన్స్ చేసి ఆలౌట్ అయింది. 331 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలో కొంచెం ఇబ్బంది పడింది.
అలీస్సా హీలీ (Alyssa Healy) బ్యాటింగ్ చేపట్టాక మ్యాచ్ ఆసీస్ వైపు తిరిగింది. ఈమె 107 బంతుల్లో 142 పరుగులు చేసింది. ఉమన్ ఆఫ్ ది మ్యాచ్‌గా హీలీ నిలిచింది.