అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs AUS | ఆస్ట్రేలియా Australia పర్యటనలో ఉన్న భారత జట్టు నేడు (శనివారం, నవంబర్ 8) ఆతిథ్య జట్టుతో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఆడనుంది.
ఈ హై వోల్టేజ్ పోరుకు బ్రిస్బేన్ Brisbane లోని గబ్బా స్టేడియం Gabba ground వేదికగా మారింది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ Suryakumar Yadav సేన, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోవాలని కసితో ఉంది.
మరోవైపు, సొంతగడ్డపై సిరీస్ ఓటమిని నివారించి 2-2తో సమం చేయాలని మిచెల్ మార్ష్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రణాళికలు రచిస్తోంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం కానుంది.
IND vs AUS | ఆస్ట్రేలియాకు ‘డూ ఆర్ డై’ మ్యాచ్
గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత్ 48 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (46), అభిషేక్ శర్మ (28) రాణించగా, బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
కేవలం 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆ ఉత్సాహాన్ని గబ్బాలోనూ కొనసాగించి, వన్డే సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆతృతగా ఉంది.
సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు కీలకం. సొంత ప్రేక్షకుల మద్దతుతో, పేస్‌కు అనుకూలించే గబ్బా Gabba పిచ్పై సత్తా చాటాలని మార్ష్ సేన వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
గత మ్యాచ్‌లో బ్యాటింగ్ Battingవైఫల్యం జట్టును కుదిపేసింది. ఈసారి గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసకర బ్యాటర్లు రాణిస్తే సిరీస్ సమం చేసే అవకాశం ఉంది. పనిభారం దృష్ట్యా టీమిండియా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వొచ్చని సమాచారం.
అతని స్థానంలో హర్షిత్ రాణాకి అవకాశం దక్కవచ్చు. అలాగే, వికెట్ కీపర్ జితేష్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
ఇరుజట్లు గెలుపుకోసం ఆఖరి బంతి వరకు పోరాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ తుది టీ20 పోరులో క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 థ్రిల్ పంచడం ఖాయంగా ఉంది. గబ్బాలో గెలిచేది ఎవరు? సిరీస్ కప్ ఎవరి చేతిలోకి చేరుతుందో చూడాలి!
